
David Warner Butta Bomma: లాక్‌డౌన్ వేళ టిక్‌టాక్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన హడావిడిని ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. తన కుటుంబంతో కలిసి వార్నర్ చేసిన టిక్‌టాక్‌లు అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. ఇక తెలుగువారంటే ప్రత్యేక శ్రద్ధ చూపే వార్నర్.. ‘మైండ్ బ్లాక్’, ‘పక్కా లోకల్’, ‘ముక్కలా మూకాబుల’, ‘రాములో రాముల’, ‘బుట్ట బొమ్మ’ ఇలా పలు పాటలకు స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఇక తాజాగా మరోసారి ‘బుట్టబొమ్మ’ పాటకు డాన్స్ చేశారు వార్నర్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వార్నర్.. మ్యాచ్ విరామ సమయంలో బుట్ట బొమ్మ పాటకు ఆయన స్టెప్పులు వేశారు. దాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. డేవిడ్ వార్నర్+బుట్టబొమ్మ అంటూ ఓ లవ్ ఎమోజీని పెట్టింది.
Read More:
IPL 2020: గేల్ ‘సెంచరీ’ మిస్.. ఆర్చర్ పాత ట్వీట్ వైరల్
ఏపీలో పింఛనుకు దరఖాస్తు చేసుకునే వారికి ‘కొత్త’ నిబంధన