
Archer old tweet: ఐపీఎల్ 2020లో భాగంగా శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ పవర్ హిట్టర్ క్రిస్ గేల్ చెలరేగి పోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టీమ్ ఓడినప్పటికీ.. గేల్ సిక్స్‌ల వర్షం అందరినీ ఆకట్టుకుంది. కేవలం 63 బంతుల్లో 99 పరుగులు చేశాడు. అయితే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి, సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీంతో స్టేడియంలో ఫ్రస్టేట్ కూడా అయ్యాడు. బ్యాట్‌ని విసిరికొట్టడంతో అది చాలా దూరం ఎగిరిపడిపోయింది. అయితే తన సెంచరీని మిస్ చేసిన ఆర్చర్ దగ్గరికి వెళ్లి గుడ్ బాల్ అని షేక్ హ్యాండ్ ఇవ్వడం విశేషం. కాగా గేల్ సెంచరీ మిస్ చేసుకున్న నేపథ్యంలో గతంలో ఆర్చర్ వేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ( ఏపీలో పింఛనుకు దరఖాస్తు చేసుకునే వారికి ‘కొత్త’ నిబంధన)
”నేను బౌలింగ్ వేస్తే అతడు 100 చేయలేడు” అని 2013లో ఆర్చర్ ఓ ట్వీట్ చేశారు. అలాగే ”నిన్ను నువ్వు గాయపరచుకోకు” అంటూ 2016లో మరో ట్వీట్ వేశారు. ఈ రెండు ట్వీట్లు ఇప్పుడు గేల్‌కి కరెక్ట్‌గా సరిపోతాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే భవిష్యత్‌ని ముందే ఊహించి ఆర్చర్ వేసే ట్వీట్లు పలుమార్లు నిజమైన విషయం తెలిసిందే.(కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 1,445 కొత్త కేసులు.. 6 మరణాలు)