షాకింగ్ ట్వీట్ చేసిన బ్యాడ్మింటన్‌ పీవీ సింధు

ఇండియన్ బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు సంచలన ట్వీట్‌ చేశారు. పెద్ద పెద్ద అక్షరాలతో ఐ రిటైర్‌ అని సింధు చేసిన ట్వీట్‌ చూసి అభిమానులతో పాటు అంతా షాక్‌కు గురయ్యారు.

  • Balaraju Goud
  • Publish Date - 4:44 pm, Mon, 2 November 20
షాకింగ్ ట్వీట్ చేసిన బ్యాడ్మింటన్‌ పీవీ సింధు

ఇండియన్ బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు సంచలన ట్వీట్‌ చేశారు. పెద్ద పెద్ద అక్షరాలతో ఐ రిటైర్‌ అని సింధు చేసిన ట్వీట్‌ చూసి అభిమానులతో పాటు అంతా షాక్‌కు గురయ్యారు. 25 ఏళ్ల సింధు బ్యాడ్మంటన్‌కు గుడ్‌బై చెప్పినట్టు పొరపడ్డారు. ఈ ట్వీట్ తో అభిమానులతో పాటు మీడియా కూడా ఒక్కసారిగా నివ్వరపోయింది. కానీ, ఆమె ప్రకటించింది ఆటకు రిటైర్మెంట్‌ కానే కాదు.. ఆ ట్వీట్‌లో ఉన్న ఆఖరి సందేశాన్ని జాగ్రత్తగా చదివితే అసలు విషయం అర్ధమవుతుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా నెగెటివిటీ .. నిరాశవాదంలో కూరుకుపోయారని .. తాను కూడా అందులో భాగమని తెలిపారు సింధు.. ఈ నెగెటివిటీ నుంచి తాను రిటైర్మెంట్‌ను ప్రకటిస్తునట్టు తెలిపారు.. డెన్మార్క్‌ ఓపెన్‌ తరువాత తానూ మళ్లీ సత్తా చాటుతానని పరోక్షంగా సందేశాన్ని పంపించారు సింధు..

కానీ, చాలామంది ఆమె బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినట్టు పొరపడ్డారు. కరోనాపై ప్రజలు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండరాదని తన ట్వీట్‌లో పేర్కొన్నారు సింధు. అయితే, ఈ విష‌యాన్ని త‌ప్పుగా అర్థం చేసుకున్న అభిమానులు.. ఆ త‌ర్వాత అస‌లు విష‌యం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కాగా, షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 13వ తేదీన డెన్మార్క్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ స్టార్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆమె ప్రతిభను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది.

మరోవైపు, ఈ ట్వీట్ తో క్రీడాభిమానుల్లో కొత్త సందేహాలు మొదలయ్యాయి. పీవీ సింధుకు అసలు ఏమయ్యింది ? ఐ రిటైర్‌ అని ఎందకు ట్వీట్‌ చేసింది ? ఎప్పుడు సైలెంట్‌గా ఉండే సింధు ఈ మధ్య తరచుగా ఎందుకు వార్తల్లకెక్కుతోంది ? పీపీ సింధు నిరాశ , నిస్పృహలకు కారణం కరోనా సంక్షోభమా ? లాక్‌డౌనా ? ఇంకా వేరే వ్యక్తిగత కారణాలు ఉన్నాయా ? అభిమానులతో పాటు నెటిజన్లను వేధిస్తున్న ప్రశ్న ఇది…