పాక్‌తో ఒప్పందానికి రెడీ అయిన భారత్.. ఏ విషయంలో అంటే..?

క‌ర్తార్‌పూర్ కారిడార్‌పై పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. అయితే యాత్రికుల సౌకర్యార్థం భార‌త్.. పాక్‌తో ఒప్పందానికి రెడీ అయినట్లు కేంద్రం తెలిపింది. బుధ‌వారం ఈ ఒప్పందంపై సంత‌కం చేయ‌నున్న‌ట్లు కేంద్ర విదేశాంగ‌శాఖ స్ప‌ష్టం చేసింది. క‌ర్తార్‌పూర్‌లో ఉన్న ద‌ర్బార్ సాహిబ్ గురుద్వారాకు సిక్కు యాత్రికులు వెళ్తుంటారు. ఈ నేప‌థ్యంలో యాత్రికుల‌పై విధించే ప‌న్నును ఎత్తివేయాల‌ని పాక్‌ను కోరిన‌ట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్ల‌డించింది. రెండు దేశాల మ‌ధ్య సంత‌కం పూర్త‌వ్వ‌గానే.. యాత్రికుల ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ మొదల‌వ్వ‌నుంది. న‌వంబ‌ర్ […]

పాక్‌తో ఒప్పందానికి రెడీ అయిన భారత్.. ఏ విషయంలో అంటే..?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 22, 2019 | 11:20 AM

క‌ర్తార్‌పూర్ కారిడార్‌పై పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. అయితే యాత్రికుల సౌకర్యార్థం భార‌త్.. పాక్‌తో ఒప్పందానికి రెడీ అయినట్లు కేంద్రం తెలిపింది. బుధ‌వారం ఈ ఒప్పందంపై సంత‌కం చేయ‌నున్న‌ట్లు కేంద్ర విదేశాంగ‌శాఖ స్ప‌ష్టం చేసింది. క‌ర్తార్‌పూర్‌లో ఉన్న ద‌ర్బార్ సాహిబ్ గురుద్వారాకు సిక్కు యాత్రికులు వెళ్తుంటారు. ఈ నేప‌థ్యంలో యాత్రికుల‌పై విధించే ప‌న్నును ఎత్తివేయాల‌ని పాక్‌ను కోరిన‌ట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్ల‌డించింది. రెండు దేశాల మ‌ధ్య సంత‌కం పూర్త‌వ్వ‌గానే.. యాత్రికుల ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ మొదల‌వ్వ‌నుంది. న‌వంబ‌ర్ 9వ తేదీన సుమారు 500 మంది సిక్కులు కార్తార్‌పూర్‌కు వెళ్తార‌ని కేంద్ర మంత్రి హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ పేర్కొన్నారు.

కాగా, హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ పాక్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కర్తార్‌పూర్‌ సాహెబ్‌ గురుద్వారా ప్రవేశానికై 20 డాలర్లు వసూలు చేయడం దారుణమన్నారు. తమ మత విశ్వాసాలతో పాకిస్థాన్ వ్యాపారం చేయడం సిగ్గుచేటన్నారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా.. కర్తార్‌పూర్‌ కారిడార్‌ను నవంబర్‌ 9న ప్రారంభించనున్నట్టు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్‌లోని సిక్కు తీర్థ యాత్రికులు వీసా లేకుండా పవిత్ర కర్తార్‌పూర్‌ సాహిబ్‌ వెళ్లే అవకాశం లభించింది.

Latest Articles