దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ రికవరీ రేటు.. కొత్తగా 36,604 మందికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే, గత కొద్ది రోజులుగా 50 వేల దిగువనే రోజూవారీ కేసులు నమోదవుతున్నాయి.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ రికవరీ రేటు.. కొత్తగా 36,604 మందికి కరోనా పాజిటివ్
Follow us

|

Updated on: Dec 02, 2020 | 11:31 AM

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే, గత కొద్ది రోజులుగా 50 వేల దిగువనే రోజూవారీ కేసులు నమోదవుతున్నాయి. వరుసగా 25వ రోజు 50 వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం 36,604 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్నటితో పోల్చితే 17.6శాతం పెరుగుదల కనిపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 94,99,413మందికి కరోనా వైరస్ సోకింది. అయితే, కొత్త పాజిటివ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. నిన్న 43,062మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకోగా.. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోలుకున్న వారిసంఖ్య మొత్తంగా 89,32,647గా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇది (94.03శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,28,644గా ఉండగా.. ఆ రేటు 4.51శాతానికి తగ్గింది. ఇక, ఈ వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో 501మంది ప్రాణాలు కోల్పోయారు.. మొత్తంగా ఇప్పటివరకు 1,38,122మంది కరోనా బారిన పడి మరణించారు. కాగా, ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం..నిన్న 10,96,651 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఇదిలా ఉండగా..దేశంలో కరోనా వైరస్ కేసులు పది రోజులకు పైగా 50 వేలకు దిగువనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. కొత్త కేసులు, నిర్ధారణ పరీక్షల సంఖ్యకు సంబంధించి నవంబర్ 21 నుంచి ఇప్పటి వరకు నమోదై వివరాలతో కూడిన గ్రాఫ్‌ను ట్వీట్ చేసింది.