సైనిక క్యాంటీన్లలో ‘విదేశీ’ వస్తువుల అమ్మకాల నిషేధం, లిక్కర్ కూడా ?

దేశంలోని సుమారు 4 వేల మిలిటరీ క్యాంటీన్లలో  దిగుమతి చేసుకున్న (విదేశీ) వస్తువుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిలో విదేశీలిక్కర్ (మద్యం) కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Umakanth Rao
  • Publish Date - 12:56 pm, Sat, 24 October 20

దేశంలోని సుమారు 4 వేల మిలిటరీ క్యాంటీన్లలో  దిగుమతి చేసుకున్న (విదేశీ) వస్తువుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిలో విదేశీలిక్కర్ (మద్యం) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డియాజియో, పెర్నాడ్ రికార్డ్  వంటి  ఫారిన్  లిక్కర్ కి ఇక ఇండియాలో ప్రవేశం లేనట్టే ! ఆర్మీ స్టోర్లలో ఎలెక్ట్రానిక్, ఇతర విదేశీ వస్తువులను మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు తక్కువ (డిస్కౌంట్) ధరలకే వీటిని విక్రయిస్తున్నారు. వీటి అమ్మకాలు ఏడాదికి సుమారు 200 కోట్ల డాలర్లపై మాటే అంటున్నారు. అయితే భవిష్యత్తులో దిగుమతి అయ్యే ఈ విధమైన వస్తువులను బ్యాన్ చేస్తున్నట్టు రక్షణ శాఖ ఈ నెల 19 న ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అధికారులతో గతంలో పలుమార్లు చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. నిర్దిష్టంగా ఏయే వస్తువులపై బ్యాన్ వేటు వేశారన్నది తెలియలేదు. విదేశీ మద్యం ఈ లిస్టులో ఉన్నట్టు చెబుతున్నారు. భారత ప్రభుత్వ స్టోర్ల నుంచి తమకు ఆర్దర్లు నిలిచిపోయాయని పెర్నాడ్, డియాజియో మద్యం తయారీ సంస్థలు గతంలోనే తెలిపాయి. ఇప్పటికే చైనా ఉత్పత్తులను  ప్రభుత్వం నిషేధించింది.