బంగాళాఖాతంలో అల్పపీడనం, అతిభారీ వర్షాలు..

ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో, రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే.. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దీంతో.. నేడు ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ విభాగం వెల్లడించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు […]

బంగాళాఖాతంలో అల్పపీడనం, అతిభారీ వర్షాలు..
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2019 | 8:38 AM

ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో, రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే.. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దీంతో.. నేడు ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ విభాగం వెల్లడించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.