లూసిఫర్ రీమేక్‌లో గోవా బ్యూటీ..? తొలిసారి మెగాస్టార్‌తో జతకట్టనున్న అందాల తార.

సుధీర్ఘ విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను అందుకున్నారు. అయితే రెండో చిత్రంగా వచ్చిన ‘సైరా నర్సింహా రెడ్డి’ తర్వాత చిరు మళ్లీ వెండితెరపై కనిపిచంలేదు.

లూసిఫర్ రీమేక్‌లో గోవా బ్యూటీ..? తొలిసారి మెగాస్టార్‌తో జతకట్టనున్న అందాల తార.
Follow us

|

Updated on: Dec 24, 2020 | 11:44 AM

ileana pairs with chiru: సుధీర్ఘ విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను అందుకున్నారు. అయితే రెండో చిత్రంగా వచ్చిన ‘సైరా నర్సింహా రెడ్డి’ తర్వాత చిరు మళ్లీ వెండితెరపై కనిపిచంలేదు. అయితే ఇప్పుడా ఖాళీని భర్తీ చేయడానికి ఒకేసారి మూడు సినిమాలతో బిజీగా మారారు చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్న చిరు.. ఆ తర్వాత లూసిఫర్, వేదాళం రీమేక్‌లో నటించనున్నారు. ఇక లూసిఫర్ రీమేక్ విషయానికొస్తే ఈ చిత్రాన్ని తొలుత వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే చివరికి ఈ సినిమా తమిళ దర్శకుడు మోహన్ రాజా చేతుల్లోకి వెళ్లింది. ఆచార్య చిత్ర షూటింగ్ పూర్తికాగానే లూసిఫర్ రీమేక్ మొదలు పెట్టనున్నారు చిరు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ ప్రచారం ప్రకారం.. ఈ సినిమాలో చిరు సరసన గోవా బ్యూటీ ఇలియానా నటించనుంది. ఒకప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. చివరిగా రవితేజ సరసన ‘అమర్.. అక్బర్.. ఆంటోనీ’లో నటించిన ఈ చిన్నది మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ చిరు సినిమాతో ఎంట్రీ ఇవ్వనుందనే చర్చ జరుగుతోంది. లూసిఫర్‌లో నటించడానికి ఇలియానా కూడా ఆసక్తి చూపిందని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాలి.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు