ఏసీబీకి చిక్కిన షేక్‌పేట ఆర్ఐ, బంజారాహిల్స్ ఎస్‌ఐ..!

హైదరాబాద్ అవినీతి నిరోధక అధికారులకు మరో ఇద్దరు లంచగొండి ఉద్యోగులు చిక్కారు. షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ షేక్‌పేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, టు బంజారాహిల్స్‌ ఎస్‌ఐ ఏసీబీకి చిక్కారు.

ఏసీబీకి చిక్కిన షేక్‌పేట ఆర్ఐ, బంజారాహిల్స్ ఎస్‌ఐ..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 06, 2020 | 5:09 PM

హైదరాబాద్ అవినీతి నిరోధక అధికారులకు మరో ఇద్దరు లంచగొండి ఉద్యోగులు చిక్కారు. షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ షేక్‌పేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీకి చిక్కాడు. స్థల యజమాని నుంచి రూ. 50 లక్షలు ఆర్‌ఐ నాగార్జున డిమాండ్‌ చేశారు. షేక్‌పేట ఆర్‌ఐతో పాటు బంజారాహిల్స్‌ ఎస్‌ఐ రవీంద్ర నాయక్ డబ్బులు తీసుకుంటూ దొరికిపోయారు. బంజారాహిల్స్‌లో సయ్యద్‌ అబ్దుల్‌కు చెందిన ఒకటిన్నర ఎకరం స్థలంపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. భూమిని రెవెన్యూ స్థలంగా ప్రభుత్వం రికార్డులు సూచిస్తున్నాయి. అయితే స్థలం తమదేనంటూ సయ్యద్‌ అబ్దుల్‌ కోర్టును ఆశ్రయించడంతో.. సయ్యద్‌ అబ్దుల్‌దేనంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ బోర్డు తీసేసి సయ్యద్‌ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అయితే రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సయ్యద్‌ అబ్దుల్‌పై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్ఐ నాగార్జునతో పాటు ఎస్‌ఐ రవీంద్ర నాయక్ రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో సయ్యద్ అవినీతి అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్కా ఫ్లాన్ వేసిన ఏసీబీ అధికారులు ఇద్దర్ని వల పన్ని రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు.