హైదరాబాద్‌ మెట్రోలో.. నూతన టికెట్ విధానం..!

హైదరాబాద్ మెట్రో సర్వీసు మరింత సులభతరం కానుంది. ఇప్పటి వరకు మెట్రో ఎక్కాలంటే టికెట్ కొనేందుకు కౌంటర్ల వద్ద క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చేది. అయితే తొలుత ఈ కౌంటర్లలో టికెట్ కొనడం సులువుగానే ఉండేది. కానీ గతకొద్ది రోజులుగా ప్రయాణికులు పెరగడంతో.. టికెట్ కౌంటర్ల వద్ద ఒక్కొసారి ప్రయాణికులు క్యూ లైన్లలో బారులుతీరే పరిస్థితి నెలకొంది. దీంతో మెట్రో అధికారులు.. ప్రయాణికులు టికెట్ కొనేందుకు సులువుగా.. ఇక క్యూఆర్ టికెట్ పద్దతిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. […]

హైదరాబాద్‌ మెట్రోలో.. నూతన టికెట్ విధానం..!
Follow us

| Edited By:

Updated on: Dec 23, 2019 | 2:14 AM

హైదరాబాద్ మెట్రో సర్వీసు మరింత సులభతరం కానుంది. ఇప్పటి వరకు మెట్రో ఎక్కాలంటే టికెట్ కొనేందుకు కౌంటర్ల వద్ద క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చేది. అయితే తొలుత ఈ కౌంటర్లలో టికెట్ కొనడం సులువుగానే ఉండేది. కానీ గతకొద్ది రోజులుగా ప్రయాణికులు పెరగడంతో.. టికెట్ కౌంటర్ల వద్ద ఒక్కొసారి ప్రయాణికులు క్యూ లైన్లలో బారులుతీరే పరిస్థితి నెలకొంది. దీంతో మెట్రో అధికారులు.. ప్రయాణికులు టికెట్ కొనేందుకు సులువుగా.. ఇక క్యూఆర్ టికెట్ పద్దతిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసిన తర్వాత.. క్యూఆర్‌ కోడ్‌తో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ “క్యూఆర్‌ కోడ్‌” టికెట్‌ కార్యక్రమాన్ని మెట్రో ఎండీ ఎన్వీస్‌ రెడ్డి సోమవారం నాడు ప్రారంభించనున్నారు.

కాగా, ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు.. మెట్రో వైపు మొగ్గుచూపారు. మరోవైపు తాజాగా ఆర్టీసీ నగరంలో తిరిగే బస్సు సర్వీసుల్ని తక్కువ చేయడంతో.. మెట్రో రైళ్లు కిటికిటలాడుతున్నాయి. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రధాన రూట్లలో బస్సుల సంఖ్య తగ్గడంతో.. ప్రయాణికులు మెట్రో వైపు చూస్తున్నారు. దీంతో కొద్ది రోజుల నుంచి మెట్రో ప్రయాణికుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.