Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 90 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 190535. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 93322. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 91819. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5394. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • నేడు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ. ప్రధాని నివాసంలో భేటీ కానున్న కేంద్ర కేబినెట్. పలు ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయనున్న కేబినెట్. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, కోవిడ్-19 సహా పలు అంశాలపై చర్చించే అవకాశం.
  • కడపజిల్లా: చెన్నూరు మండల కేంద్రంలో సానిటయిజర్ తాగి తల్లీ కొడుకు మృతి.. మృతులు ఎల్లమ్మ గుడి వీధికి చెందిన కళావతి, శ్రీరామ్ నాయక్ లుగా గుర్తింపు.. మత్తు కోసమే సానిటయిజర్ తాగినట్లు పోలీసులు వెల్లడి.. రిమ్స్ కు తరలింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • విశాఖ నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కన్యాకుమారి, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతాల్లోకి రుతుపవనాల ఆగమనం అరేబియా సముద్రంలోని ఆగ్నేయ, తూర్పు మధ్య ప్రాంతాల్లో బలపడుతున్న అల్పపీడనం, ఇది ఈనెల మూడు నాటికి తుపానుగా మారి మహారాష్ట్ర, గుజరాత్ ల మీదికి ప్రయాణిస్తుందని అంచనా తెలంగాణ ,కోస్తాంధ్రలలో నేడు కూడా కొనసాగనున్న గాలివానలు.
  • విజయవాడ: రైల్వే డివిజన్ గుంటూరు నుండి సికింద్రాబాద్ కి బయలుదేరిన గిల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్. గుంటూరు నుండి వయ విజయవాడ, వారంగల్ మీదగా సికింద్రాబాద్ చేరుకోనున్న ట్రైన్. ఇంటర్ స్టేట్ ట్రైన్ ప్రయాణాన్ని తాత్కాలికంగా ఆపిన రైల్వేశాఖ. ఇంటర్ స్టేట్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ టికెట్లు క్యాన్సల్ చేయబడ్డాయి. రిజర్వేషన్ పూర్తి మొత్తం సొమ్మును తిరిగి ఇవ్వనున్న రైల్వేశాఖ. ఇంటర్ స్టేట్ సర్వీసులు ఎప్పటినుండి మొదలుకనున్నాయో త్వరలోనే ప్రకటించనున్న రైల్వేశాఖ.
  • అమరావతి: డిజీపీ గౌతమ్ సవాంగ్ కామెంట్స్. అంతరాష్ట్ర రాక పోకలపై షరతులు కొనసాగుతాయి. కదలిక లపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు. ఏపీ కి రావాలనుకునే ప్రయాణీకులు స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాలి. కరోన ప్రభావం తక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారెంటైన్ లో ఉండాలి.

జీతం డబ్బుల కోసం భార్యను కడతేర్చిన భర్త..!

Hyderabad Husband Killed wife asked for salary amount, జీతం డబ్బుల కోసం భార్యను కడతేర్చిన భర్త..!

జీతం డబ్బులు అడిగిందుకు భార్యను హత్య చేశాడో భర్త. విషయం బయటకి పొక్కుతుందని ఆత్మహత్య డ్రామా మొదలు పెట్టాడు. పోలీసుల రంగ ప్రవేశంలో అసలు సంగతి బయటపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది.
కుషాయిగూడ‌లోని ఏఎస్​ రావు నగర్​లో నివాస‌ముంటున్న సంతోష్​ చౌహాన్.. స్థానిక వ్యాపారి ప‌ర‌మేశ్ పాటిల్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నాడు. అయితే గ‌త రాత్రి జీతం డ‌బ్బుల విష‌య‌మై భార్య దీపాలి చౌహాన్​ తో గొడ‌వ‌ప‌డ్డాడు సంతోష్ చౌహాన్. ఈ క్ర‌మంలో దీపాలి త‌న భర్త‌పై కోపంతో కిచెన్ లో ఉన్న పట్టుకారును అత‌నిపై విసిరింది. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్​ భార్య దీపాలి గొంతు నులిమి హతమార్చాడు. దీపాలి చనిపోయిందని నిర్ధారించుకున్న సంతోష్.. కొంతసేపటికి తన భార్య ఆత్మహత్య చేసుకుందని స్నేహితులకు ఫోన్​ చేసి చెప్పాడు. విషయం తెలుసుకున్న సంతోష్​ యజమాని పరమేష్​ కుషాయిగూడ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంతోష్​ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్ చౌహాన్ ను అరెస్ట్ చేశారు.

Related Tags