‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ ​ స్ట్రీమింగ్‌ను నిలిపివేసిన కోర్టు

ఈరోజు(సెప్టెంబరు 2) నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కావాల్సిన‌ 'బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌' వెబ్‌సిరీస్‌కు బ్రేకులు ప‌డ్డాయి. దాని ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేయాల‌ని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఇంజంక్షన్‌ ఉత్తర్వులు వెలువ‌రించింది.

'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్' ​ స్ట్రీమింగ్‌ను నిలిపివేసిన కోర్టు
Follow us

|

Updated on: Sep 02, 2020 | 2:55 PM

ఈరోజు(సెప్టెంబరు 2) నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కావాల్సిన‌ ‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌’ వెబ్‌సిరీస్‌కు బ్రేకులు ప‌డ్డాయి. దాని ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేయాల‌ని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఇంజంక్షన్‌ ఉత్తర్వులు వెలువ‌రించింది. సత్యం కుంభకోణం నేపథ్యంలో తన లైఫ్ స్టోరీని చిత్రీకరించారన్న అనుమానాలున్నాయని, దీని ప్రదర్శనను అడ్డుకోవాలంటూ సత్యం కంప్యూటర్స్‌ మాజీ ఛైర్మన్‌ బి.రామలింగరాజు కోర్టును ఆశ్రయించారు. దీనిపై సిటీ సివిల్‌ కోర్టు విచారణ చేపట్టంది. పిటిషనర్‌ తరఫున సీనియర్ లాయ‌ర్ ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కింది కోర్టు రామలింగరాజుకు ఏడేళ్ల జైలు శిక్షను విధించిందని, దీనిపై ఆయన పైకోర్టుకు అప్పీలు చేశారన్నారు. కేసు విచార‌ణ సాగుతుండ‌గా వెబ్‌సిరీస్‌ తీసి రిలీజ్ చేయడం సరికాదన్నారు. వాదనలను విన్న సివిల్‌ కోర్టు.. వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తూ ఇంజంక్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read :

మృతి చెందిన ప‌వ‌న్ ఫ్యాన్స్ కుటుంబాల‌కు బన్నీ ఆర్థిక సాయం

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ : హైకోర్టు కీలక ఆదేశాలు