హైదరాబాద్‌లో కొత్త రకం డ్రగ్స్ దందా.. ఆ శక్తి రెట్టింపు అవుతుందంటూ విక్రయాలు

హైదరాబాద్ కేంద్రంగా మరో రకం గలీజ్ దందాకు డ్రగ్స్ ముఠా తెరలేపింది. సెక్స్‌ సామర్థ్యం పెరుగుతుదంటూ డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ సిటీ పోలీసులు పట్టుకున్నారు. పబ్‌లకు వచ్చే యువతను ఆకర్షించి...

  • Sanjay Kasula
  • Publish Date - 10:49 pm, Thu, 19 November 20
హైదరాబాద్‌లో కొత్త రకం డ్రగ్స్ దందా.. ఆ శక్తి రెట్టింపు అవుతుందంటూ విక్రయాలు

hyderabad city police : హైదరాబాద్ కేంద్రంగా మరో రకం గలీజ్ దందాకు డ్రగ్స్ ముఠా తెరలేపింది. సెక్స్‌ సామర్థ్యం పెరుగుతుదంటూ డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ సిటీ పోలీసులు పట్టుకున్నారు. పబ్‌లకు వచ్చే యువతను ఆకర్షించి డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెల్లడించారు.

డ్రగ్స్‌ ముఠా నుంచి 200 గ్రాముల మెఫిడ్రిన్‌ మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. పబ్బుల్లో పరిచయాలు పెంచుకొని డ్రగ్స్‌ విక్రయాలు జరుపుతున్నారని పోలీసులు వెల్లడించారు. ముంబై నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి హైదరాబాద్‌కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ప్రముఖ హోటల్‌లో పని చేసిన చెఫ్‌ సలీమ్‌ను సూత్రధారిగా గుర్తించామని పోలీసులు తెలిపారు.