మీ పిల్లల కోసం యూనిక్ నేమ్స్ ఆలోచిస్తున్నారా.. ఇవన్నీ ఇండియాలో నదుల పేర్లే!

తల్లిదండ్రుల జీవితంలోనే అత్యంత మధురమైన, ఆనందకరమైన క్షణం అంటే కొత్తగా బిడ్డ పుట్టడమే. ఆ చిన్నారి రాకతో ఇల్లంతా ప్రేమ, కొత్త ఆశలతో నిండిపోతుంది. ఈ వేడుకతో పాటు వచ్చే అత్యంత ముఖ్యమైన బాధ్యత.. ఆ బేబీకి అందమైన పేరు పెట్టడం. పేరు అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు; అది ఆ బిడ్డకు తల్లిదండ్రులు ఇచ్చే జీవితకాలపు కానుక. అమ్మాయిలు, అబ్బాయిల కోసం కొన్ని పేర్లు..

మీ పిల్లల కోసం యూనిక్ నేమ్స్ ఆలోచిస్తున్నారా.. ఇవన్నీ ఇండియాలో నదుల పేర్లే!
Unique Baby Names

Updated on: Nov 25, 2026 | 11:10 PM

తల్లిదండ్రుల జీవితంలోనే అత్యంత మధురమైన, ఆనందకరమైన క్షణం అంటే కొత్తగా బిడ్డ పుట్టడమే. ఆ చిన్నారి రాకతో ఇల్లంతా ప్రేమ, కొత్త ఆశలతో నిండిపోతుంది. ఈ వేడుకతో పాటు వచ్చే అత్యంత ముఖ్యమైన బాధ్యత.. ఆ బేబీకి అందమైన పేరు పెట్టడం. పేరు అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు.. ఆ బిడ్డకు తల్లిదండ్రులు ఇచ్చే జీవితకాలపు కానుక. అందుకే బాగా ఆలోచించి పెట్టిన ఒక చక్కని పేరు ఆ బిడ్డకు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపును, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

కాగా నేటి కాలంలో చాలామంది తల్లిదండ్రులు ఆధునికంగా ఉంటూనే, మంచి అర్థం వచ్చేలా ప్రకృతి, పురాణాలు లేదా మన దేశంలోని పవిత్ర నదుల ఆధారంగా పేర్లను ఎంచుకుంటున్నారు. అలాంటి మంచి పేర్ల కోసం వెతుకుతున్నవారికి భారతదేశంలోని నదుల పేర్లు చక్కని ఎంపిక కావచ్చు. ప్రకృతి, పవిత్రత, ప్రశాంతతకు ప్రతీకలైన ఈ నదుల పేర్లు పలకడానికి సులభంగా ఉండటమే కాకుండా ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఇస్తాయి. అమ్మాయిలు, అబ్బాయిల కోసం అలాంటి కొన్ని అందమైన పేర్లు వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం…

అమ్మాయిల కోసం అందమైన నదుల పేర్లు..

జాహ్నవి: గంగా నదికి ఉన్న మరో పేరు జాహ్నవి. ఈ పేరు సంప్రదాయంతో పాటు ప్రత్యేకతను కూడా కలిగి ఉంటుంది.

యామి: యమునా నది పేరుతో ముడిపడి ఉన్న చిన్న, అందమైన పేరు యామి.

కావేరి: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నది కావేరి. ఈ పేరు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు దగ్గరగా ఉంటుంది.

అలకనంద: హిమాలయ ప్రాంతం నుంచి ప్రవహించే అలకనంద నది పేరు ఇది. వినడానికి ప్రత్యేకంగా ఉండే ఈ పేరు సంప్రదాయాన్ని ఇష్టపడే తల్లిదండ్రులకు నచ్చుతుంది.

రేవా: నర్మదా నదికి ఉన్న మరో పేరు రేవా. చిన్నగా, అందంగా ఉండే ఈ పేరు ప్రత్యేకమైన ఎంపికగా నిలుస్తుంది.

మహి: భారతదేశంలోని ముఖ్యమైన నదుల్లో మహి ఒకటి. చిన్నగా, సులభంగా పలకగలిగే ఈ పేరు ఆధునికంగా ఉంటుంది.

అబ్బాయిల కోసం అందమైన పేర్లు..

సుజల్.. స్వచ్ఛమైన, నిర్మలమైన నీరు అనే అర్థం వచ్చే పేరు సుజల్.

నీర్.. నీరు అనే అర్థం వచ్చే చిన్న పేరు నీర్.

రవి.. రావి అనే నది నుంచి ఈ పేరును పరిశీలించవచ్చు. అలానే రవి అనే పదానికి సూర్యుడు అనే అర్థం కూడా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us