ట్రెండ్ సెట్ చేస్తాం బాస్.. ఇది ఆదివాసీ స్టైల్ గ్రిల్డ్ మీట్.. ఐడియా అదుర్స్ అనాల్సిందే..

ప్రకృతితో కలిసి జీవించటం అనాదిగా మనిషి మనుగడకు కారణమవుతుంది. ఆదిమానవుడిగా చెట్ల ఆకులను కట్టుకున్నా, ఆహారం కోసం జంతువులను వేటాడినా.. అది కేవలం మనుగడ కోసమే. అయితే కాలంతో పాటు అన్ని వేగంగా మారుతున్నాయి. పట్టణీకరణ వేగంగా విస్తరిస్తోంది..

ట్రెండ్ సెట్ చేస్తాం బాస్.. ఇది ఆదివాసీ స్టైల్ గ్రిల్డ్ మీట్.. ఐడియా అదుర్స్ అనాల్సిందే..
Tribal Grilled Meat Recipe
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 28, 2024 | 11:19 AM

ప్రకృతితో కలిసి జీవించటం అనాదిగా మనిషి మనుగడకు కారణమవుతుంది. ఆదిమానవుడిగా చెట్ల ఆకులను కట్టుకున్నా, ఆహారం కోసం జంతువులను వేటాడినా.. అది కేవలం మనుగడ కోసమే. అయితే కాలంతో పాటు అన్ని వేగంగా మారుతున్నాయి. పట్టణీకరణ వేగంగా విస్తరిస్తోంది.. ప్రపంచీకరణ ప్రభావంతో వివిధ దేశాల సంస్కృతులు, ప్రాంతాల ఆహార అలవాట్లు వ్యక్తి జీవితంపై చాలానే ప్రభావం చూపిస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ మండల, గ్రామీణ స్థాయి ప్రాంతాల్లో సైతం పెద్ద పెద్ద హోటల్స్ వెలసి భిన్నమైన ఆహారాన్ని అందిపుచ్చుకునేలా ఆకర్షిస్తున్నాయి. ఇలా పాశ్చాత్య ఆహారం ప్రజా జీవితంపై పెను ప్రభావాన్నే చూపుతోంది. అందరూ రుచి.. భిన్నమైన ఆహారపు అలవాట్లను అనుసరిస్తున్నారు.. అయితే.. ఇది మైదాన ప్రాంతానికే కాదు.. గిరిజన ప్రాంతానికి కూడా విస్తరిస్తున్నాయి.. ఆదివాసిలను సైతం ఆకర్షిస్తున్నాయి.. ఇలాంటి గ్రిల్ ఆహారానికి గిరిజనులు సైతం లోనవుతున్నారడానికే ఇదో నిదర్శనం.. ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తి ఐడియా బలే అదిరిపోయింది. అదేంటో ఈ స్టోరీ చదవండి..

ఆదివాసి గుత్తి కోయల ఆహారపు అలవాట్లు నగరాల్లో జీవించే వారికి భిన్నంగా ఉంటాయి. వాళ్లు స్థానికగా దొరికే వస్తువులతో ఆహారాన్ని తయారు చేసుకుంటారు. ఆహార అలవాటులో చీమల చెట్నీలు, లేత వెదురు బొంగులతో కూర, బొంగులో చికెన్ ఇలా కాస్త వెరైటీగా తింటూ ఆస్వాదిస్తారు. అంతేకాకుండా వారి జీవనశైలి కూడా అందరికంటే భిన్నంగానే ఉంటుంది..

అయితే.. రెండు దశాబ్దాల క్రితం చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి కొంత మంది ఆదివాసులు వలస వచ్చారు. వీరంతా ఏపీ ఏలూరు జిల్లా పరిధిలోని అడవిలో నివాసం ఉంటున్నారు. వీరిలో దాదాపు 90 శాతం మంది ఎటువంటి సౌకర్యం లేని అటవీ ప్రాంతాలలోనే నివాసం ఉంటున్నారు. కనీసం రోడ్లు కూడా ఉండవు. వర్షాధారంతో పండే అక్కడ పంటలతోనే జీవనం సాగిస్తున్నారు. కానీ, అడవిలో జీవించే ఆదివాసుల జీవనం విధానం కొంత విభిన్నంగా ఉంటాయన్నది వాస్తవం.. సహజంగా ఆయా సీజన్లలో పండే పంటలపై ఆధారపడుతూ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో పాశ్చాత్య ఆహారాలతో సహా అన్ని వంటకాలు అందుబాటులో ఉంటాయి.. కబాబ్స్, గ్రిల్డ్.. ఇలా రుచులను ఆస్వాదించవచ్చు.. అయితే.. ఈ మధ్యకాలంలో మాంసాహార ప్రియులు గ్రిల్డ్ చికెన్, మటన్ లాంటి వాటికి ఎక్కువగా చూపిస్తున్నారు. చికెన్ లేదా మటన్, ఫిష్ ముక్కలకు మసాలా దట్టించి వాటిని బొగ్గుల వేడి పై దానిపై అమర్చిన జాలిపై కాలుస్తారు. ఇందులో నూనె ఎక్కువగా వాడకపోవటం, నూనెలో ఫ్రై చేయటం ద్వారా వచ్చే టెస్ట్ కంటే గ్రిల్డ్ చికేన్ టెస్ట్ బాగుటుందని చెబుతారు. ఇక కోడి మొత్తాన్ని బొగ్గుల వేడి, లేదా మంటపై కాల్చటం ద్వారా వచ్చే మాంసం తందూరిగా పిలుస్తారు. ఇలా గ్రిల్డ్, తందూరీ చేయటానికి అనువైన ప్రత్యేక వస్తువులను వ్యాపారులు ఉపయోగిస్తారు.

Tribal Grilled Meat

Tribal Grilled Meat

అయితే అదే ఆదివాసీలు గ్రిల్డ్ మీట్ చేస్తే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా..? అరే అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు కదా.. వారెందుకు అలాంటివి తింటారు.. అనుకునేరు.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వారు కూడా ఎప్పటినుంచో గ్రిల్డ్ మీట్ తినటం మొదలుపెట్టారు. కుక్కునూరు మండలం కురుమలతోగు ఆదివాసీ గ్రామంలో అక్కడ దొరికిన మాంసాన్ని ఓ సైకిల్ చక్రానికి వేలాడు తీసి.. చక్రం చుట్టూ మాంసం ముక్కలు పెట్టి.. కింద మంట అందిస్తూ చక్రాన్ని తిప్పుతూ మాంసం ఉడికేలా చేస్తున్నారు. ఇలా నాచురల్ గా గ్రిల్డ్ మీట్ తినటం చాలా బాగుంటుందని ఆదివాసులు పేర్కొంటున్నారు.

వీడియో చూడండి..

ఆది మానవులు పచ్చి మాంసాన్ని మంటల్లో వేసి ఉడికిన తర్వాత తినే వారట.. అలా అలాంటి కొన్ని పద్ధతులను ఈ ఆదివాసులు అవలంభిస్తుంటారు. ఇలా తినటం కూడా ఎంతో రుచిగా ఉంటుందని.. ఆరోగ్యానికి మంచిదని ఆదివాసులు చెబుతున్నారు. పట్టణాలలో కూడా ఇది ఓ ట్రెండ్ గా మారింది. ఇది చూసాక పెద్దలు ముందే చెప్పారుకదా పుర్రె కో బుద్ది , జిహ్వకో రుచి.. అని మరోసారి మీకు గుర్తుకురాకతప్పదు మరి.. ఏదిఏమైనా.. ఆదివాసుల ఐడియా అదుర్స్ గురూ..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేవర కోసం యాట మొక్కు.. ఎవ్వరూ తగ్గట్లే !!
దేవర కోసం యాట మొక్కు.. ఎవ్వరూ తగ్గట్లే !!
దేవర హిట్‌.. యంగ్‌ టైగర్ రియాక్షన్
దేవర హిట్‌.. యంగ్‌ టైగర్ రియాక్షన్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..