TTD: 365 రోజుల్లో 450 ఉత్సవాలు.. శ్రీవారి భక్తులకు కన్నుల పండగే..

365 రోజుల్లో 450పై ఉత్సవాలు నిర్వహిస్తున్న తిరుమలలో ఉత్సవాలే ఉత్సవాలు అన్నట్లు శ్రీవారి ని భక్తులు కన్నులారా తరించే భాగ్యం కలిగిస్తోంది. 'స్మరణాత్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్‌' అని స్వామిని తలంచే భక్తులకు అన్ని పాపాలు హరించబడుతాయన్న నమ్మకం విశ్వాసం భక్తుల్లో కలగజేస్తోంది...

TTD: 365 రోజుల్లో 450 ఉత్సవాలు.. శ్రీవారి భక్తులకు కన్నుల పండగే..
Tirumala
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Sep 28, 2024 | 11:09 AM

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్క హిందువు కోరుకుంటారు. కనీసం ఏడాదిలో ఒక్కసారైనా స్వామి వారిని దర్శించుకోవాలని కోరుకుంటారు. ఇక ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆలయం బయట జరిగే ఈ వేడుకలను చూసేందుకు దేశనలుమూలల నుంచి భక్తకోటి జనం తిరుమలకు తరలి వస్తుంటారు. అలాంటి భక్తులకు ఈ ఏడాది కన్నుల పండగగా సాగుతోందని చెప్పాలి. దీనికి కారణంగా ఈ ఏడాది టీడీటీడీ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది.

365 రోజుల్లో 450పై ఉత్సవాలు నిర్వహిస్తున్న తిరుమలలో ఉత్సవాలే ఉత్సవాలు అన్నట్లు శ్రీవారి ని భక్తులు కన్నులారా తరించే భాగ్యం కలిగిస్తోంది. ‘స్మరణాత్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్‌’ అని స్వామిని తలంచే భక్తులకు అన్ని పాపాలు హరించబడుతాయన్న నమ్మకం విశ్వాసం భక్తుల్లో కలగజేస్తోంది. కోరికలు ఈరేడుతాయనీ ముక్తి సంప్రాప్తిస్తుందన్నది శ్రీవారి భక్తుల ప్రగాఢ విశ్వాసంగా టీటీడీ ఏడాది పొడవునా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉత్సవాలను జరుపుతోంది. భక్తజనప్రియుడుగా ఆశ్రితకల్పతరువుగా కోరిన వరాలిచ్చే కోనేటిరాయుడైన శ్రీ వేంకటేశుడు వెలసివున్న తిరుమల దివ్యక్షేత్రంలో అన్నీ అద్భుతాలే అన్నట్లు భక్తులు తనివి తీరా ఉత్సవాలను వీక్షించే భాగ్యం కలిగిస్తోంది.

నిత్య కల్యాణం పచ్చ తోరణంగా ఏడుకొండల వాడి సన్నిధిలో ప్రతిరోజూ ఉత్సవమే జరుగుతోంది. సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన వంటి నిత్యోత్సవాలు, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం వంటి నక్షత్రోత్సవాలు, కోయిలాళ్వార్‌ తిరుమంజనం, ఉగాది ఆస్థానం, తెప్పోత్సవం, పద్మావతి పరిణయం, జేష్ఠాభిషేకం, ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం వంటి సంవత్సరోత్సవాలతో ప్రతిరోజూ ఒక పండుగగా ప్రతిపూటా పరమాన్న భరిత నివేదనలతో ఏడు కొండల స్వామి ఏడాది పొడవునా పూజలు అందుకుంటున్నారు.

Ttd

ఉత్సవాల దేవునిగా, ఆరాధింపబడుతున్న కొండల రాయుడు ఏడాదికి 365 రోజులే అయినా వెంకన్నసన్నిధిలో జరిగే ఉత్సవాలు మాత్రం 450కి పైమాటే. అలంకార ప్రియుడైన శ్రీహరి వైభవాన్ని తిలకింప వేయికన్నులైనా చాలవన్నట్లు భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తున్నారు. ఉత్సవమూర్తులు శ్రీ మలయప్ప స్వామి ఉభయదేవేరులైన శ్రీదేవీ భూదేవీలతో కూడి సర్వాంగసుందరంగా అలంకృతుడై ఏడాది పొడవునా తిరు ఉత్సవాలలో పాల్గొంటూ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు. కమలాక్షు వీక్షించు కన్నులు కన్నులు అన్నట్లు భక్తకోటిని కటాక్షిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

దేవర కోసం యాట మొక్కు.. ఎవ్వరూ తగ్గట్లే !!
దేవర కోసం యాట మొక్కు.. ఎవ్వరూ తగ్గట్లే !!
దేవర హిట్‌.. యంగ్‌ టైగర్ రియాక్షన్
దేవర హిట్‌.. యంగ్‌ టైగర్ రియాక్షన్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..