Dream: కలలో ఇవి కనిపిస్తే అస్సలు మంచిది కాదు.. ఏమవుతుందంటే..

|

Sep 15, 2024 | 8:57 PM

మనలో ప్రతీ ఒక్కరికీ కలలు వస్తుంటాయి. మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన నిజ జీవితంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కలలో మనకు కనిపించే అంశాలు కొన్ని మంచికి సంకేతమైతే మరికొన్ని చెడును సూచిస్తాయని పండితులు చెబుతుంటారు. ఇక స్వప్నశాస్త్రంలో కూడా దీనికి సంబంధించి పలు విషయాలను వెల్లడించారు..

Dream: కలలో ఇవి కనిపిస్తే అస్సలు మంచిది కాదు.. ఏమవుతుందంటే..
Dream
Follow us on

మనలో ప్రతీ ఒక్కరికీ కలలు వస్తుంటాయి. మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన నిజ జీవితంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కలలో మనకు కనిపించే అంశాలు కొన్ని మంచికి సంకేతమైతే మరికొన్ని చెడును సూచిస్తాయని పండితులు చెబుతుంటారు. ఇక స్వప్నశాస్త్రంలో కూడా దీనికి సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. ఇంతకీ కలలో ఎలాంటి వస్తువులు కనిపిస్తే చెడుకు సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

* కలలో చిరిగిన వస్తువులు కనిపించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దుస్తులు వ్యక్తి ఆశయాలకు, లక్ష్యాలను సూచన అని అంటారు. చిరిగిన వస్తువులు కనిపిస్తే.. మీ లక్ష్యాన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యమైన పనుల్లో అటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. జీవితం అగమ్య గోచరంగా ఉంటుందని, మీలో అభద్రతా భావం పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇక ఇలాంటి కలలు వస్తే మీకు జీవితంపై ఎలాంటి క్లారిటీ లేదని అర్థం చేసుకోవాలి.

* కలలో పళ్లు రాలినట్లు కనిపించడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కలలు వస్తే అభద్రతా భావం, ఆత్మవిశ్వాసం లేదని అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న పనులకే భయపడుతుంటారు. ఇలాంటి కలలు వచ్చే వారు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని చెబుతున్నారు. భవిష్యత్తులో చేయబోయే పనులపై ఫోకస్‌ పెట్టాలని చెబుతున్నార.

* కలలో లోతైన జలాశయాలు, తుపానులు కలలో కనిపించడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కలలు వస్తుంటే ఇంట్లో కలహాలు వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా భార్య,భర్తల మధ్య తగాదాలు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఏదో తెలియని ప్రమాదం రాబోతోందని ఈ కల ద్వారా అర్థం చేసుకోవాలి.

* ఇంట్లో పగిలిన అద్దం ఉంటే మంచిది కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పగిలిన అద్దం కలలో కనిపించడం ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అద్దం పగిలినట్లు కల వస్తే వైవాహిక బంధంలో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా విడాకులకు కూడా దారి తీసే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

* ఇక ఒక నిర్ణయంపై మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా..ప్రతీ విషయంలో కన్‌ఫ్యూజ్ గురవుతుంటే.. మీకు జీవితంలో క్లారిటీ లేదని అర్థం చేసుకోవాలి. మీరు తీసుకుబోయే నిర్ణయాలపై ఆచితూచి ఆలోచించాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, స్వప్నశాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..