Lifestyle: వారంలో మీ శరీరంలో ఎంత ప్లాస్టిక్ చేరుతుందో తెలుసా.?

|

Sep 15, 2024 | 5:42 PM

ప్రస్తుతం మనిషి జీవితంలో ప్లాస్టిక్ ఓ భాగమైపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా ఉపయోగించాల్సిన పరిస్థితి. అయితే ప్లాస్టిక్‌ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమైనందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...

Lifestyle: వారంలో మీ శరీరంలో ఎంత ప్లాస్టిక్ చేరుతుందో తెలుసా.?
Plastic
Follow us on

ప్రస్తుతం మనిషి జీవితంలో ప్లాస్టిక్ ఓ భాగమైపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా ఉపయోగించాల్సిన పరిస్థితి. అయితే ప్లాస్టిక్‌ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమైనందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మనకు తెలియకుండానే మన శరీరంలోకి ప్లాస్టిక్‌ వెళ్తుందన్న విషయం మీకు తెలుసా.? కంటికి కనిపించని మైక్రో, నానో ప్లాస్టిక్‌లు కంటికి కనిపించవు. ఇది శరీరంలోకి ప్రవేశించి ఎన్నో అనారోగయ సమస్యలకు దారి తీస్తుంటాయి.

తీసుకునే ఆహారం మొదలు, నీరు, గాలి వంటి మార్గాల్లో శరీరంలోకి మైక్రో నానో ప్లాస్టిక్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) నివేదిక ప్రకారం ఒక వ్యక్తి శరీరంలోకి ప్రతి వారం 5 గ్రాముల ప్లాస్టిక్‌ వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సుమారు ఒక క్రెడిట్‌ కార్డు పరిమాణంతో సమానం. శరీరంలోకి ప్లాస్ట్‌ వెళ్లడానికి ప్రధాన కారణం నీరుగా చెబుతున్నారు. మనకు తెలిసి తీసుకునే ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ద్వారా కొంత మొత్తంలో ప్లాస్టిక్‌ శరీంలోకి వెళ్తే.. భూగర్భ జలాల్లో ఉండే ప్లాస్టిక్‌ రేణువులు సైతం శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి.

ఈ నివేదిక ప్రకారం.. ఒక నెలలో 21 గ్రాముల ప్లాస్టిక్ శరీరంలోకి చేరుతోంది. ఏడాదిలో మొత్తం 250 గ్రాముల ప్లాస్టిక్‌ మన శరీరంలోకి వెళ్తుంది. 79 ఏళ్లలో ఒక వ్యక్తి శరీరంలోకి ఏకంగా 20 కిలోల ప్లాస్టిక్‌ పోగు అవుతుందని చెబుతున్నారు. ఇది దాదాపు రెండు పెద్ద డస్ట్‌బిన్‌ల పరిమాణంతో సమానం. ఇది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్లాస్టిక్ కప్పులు, డిస్పోజబుల్స్‌లో వేడి ఆహారాన్ని తినడం, పానియాలను తాగడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్‌లోని రసాయనాలు, కణాలు శరీరంలోకి చేరుతాయి. ప్లాస్టిక్‌లో ఉండే ఆన్సెనిక్‌ కొన్ని ప్రదామకరమైన వ్యాధులకు కారణమవుతుంది. శరీరంలోకి ప్లాస్టిక్‌ చేరడం వల్ల లుకేమియా, లింఫోమా బ్రెయిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు, ఊపిరితిత్తులు సంబంధిత సమస్యలు పెరుగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..