Lawyer – Advocate: కోర్టు గురించి మాట్లాడినప్పుడల్లా మేజిస్ట్రేట్, జడ్జి, లాయర్, అడ్వొకేట్ లాంటి పదాలు తరచుగా వినిపిస్తుంటాయి. అయితే, న్యాయమూర్తి, మేజిస్ట్రేట్‌తో పాటు లాయర్, అడ్వొకేట్‌ల మధ్య వ్యత్యాసాలపై ప్రజలు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. లాయర్, అడ్వకేట్ వేర్వేరా? లేక ఇద్దరూ ఒకటేనా? అని చాలామంది సందేహంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే లాయర్-అడ్వొకేట్, మేజిస్ట్రేట్-న్యాయమూర్తి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
మేజిస్ట్రేట్ – న్యాయమూర్తి మధ్య తేడాలు ఏంటి?
మేజిస్ట్రేట్ అనేది ఒక రాష్ట్రం యొక్క జ్యుడీషియల్ అధికారి లేదా నగరం, జిల్లా మొదలైన నిర్దిష్ట ప్రాంతంలో చిన్న కేసులను పరిష్కరించే పౌర అధికారి. న్యాయమూర్తి అంటే న్యాయపరమైన అధికారి. కోర్టు కార్యకలాపాలలో పాల్గొంటారు. చట్టపరమైన విషయాలను విశ్లేషించిన తర్వాత తీర్పు ఇస్తారు. అయితే, మేజిస్ట్రేట్ కూడా న్యాయమూర్తి వలె చట్టపరమైన విషయాలను నిర్వహిస్తారు.. కానీ, న్యాయమూర్తికి ఉండే అధికారాలు వారికి ఉండవు.
మేజిస్ట్రేట్ – న్యాయమూర్తి మధ్య వ్యత్యాసం చాలానే ఉంది. మేజిస్ట్రేట్లు మరణశిక్ష, జీవిత ఖైదు విధించలేరు. మేజిస్ట్రేట్ స్థాయి కూడా అనేక స్థాయిలను కలిగి ఉంటుంది. వారిలో అత్యున్నత పదవి CJM అంటే చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్. న్యాయమూర్తులు CJM కంటే పైన ఉంటారు. జిల్లా న్యాయమూర్తి, ADJ అంటే అదనపు జిల్లా న్యాయమూర్తి న్యాయమూర్తి హోదాలో వస్తారు. న్యాయమూర్తులు సివిల్ కేసులను ఈ స్థాయిలో పరిష్కరించినప్పుడు, వారిని జిల్లా న్యాయమూర్తులు అంటారు.
మేజిస్ట్రేట్‌లలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, మేజిస్ట్రేట్ ఫస్ట్, సెకండ్ క్లాస్ లేదా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పోస్ట్ మొదలైనవి ఉంటాయి. ఇది కాకుండా సెషన్స్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి తదితర పోస్టులు ఉన్నాయి.
లాయర్ – అడ్వొకేట్ మధ్య తేడాలు ఏంటి?..
లాయర్ – అడ్వొకేట్ ఇద్దరూ న్యాయశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్నవారే. కానీ, సాధారణ పరిభాషలో లాయర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈ పదాన్ని న్యాయశాస్త్రం చదివిన వారికి ఉపయోగిస్తారు. సాధారణ పదాలలో చూసుకుంటే.. ఎల్ఎల్‌బి చదివిన వ్యక్తి లాయర్ అంటారు. అయితే, న్యాయశాస్త్రం చదివిన వారందరూ లాయర్స్ అయిపోరు. వారు కేవలం న్యాయ సలహాలను మాత్రమే ఇచ్చేందు ఆస్కారం ఉంటుంది. అంతేకాదు.. వీరు ఎవరి తరఫునా కోర్టులో కేసు వేయలేరు, వాదించలేరు.
అడ్వొకేట్ విషయానికి వస్తే.. లాయర్ వేరే వెర్షన్ అడ్వొకేట్ అని చెప్పుకోవచ్చు. న్యాయశాస్త్రం చదివిన తర్వాత కోర్టులో ప్రాక్టీస్ చేసే, వాదనలు వినిపించే వారిని అడ్వొకేట్ అంటారు. మనం ఒక కేసులో కోర్టులో వాదించే వారు, కేసుపై పోరాడే వారిని అడ్వొకేట్ అంటారు. అందుకే లాయర్‌కి, అడ్వొకేట్‌కి చాలా తేడా ఉంటుంది.
Also read:
Snake in Scooty: స్కూటీలో పాముపిల్ల.. భయంతో హడలిపోయిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Beti Bachao Beti Padhao Scheme: మరీ ఇంత ఘోరమా.. ఆ పథకం నిధులన్నీ ప్రకటనలకే సమర్పయామీ..!