మీ పిల్లలతో హోంవర్క్ చేయించడం ఎలా ? కరెక్ట్ టైమ్ ఎప్పుడు ?

|

Jan 15, 2025 | 4:31 PM

పిల్లలతో హోంవర్క్ చేయించడానికి సరైన సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చాక చేయడం, లేదా హెల్తీ స్నాక్స్ తిన్న తర్వాత హోం వర్క్ చేయించడం మంచి సమయం. ఉదయాన్నే బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండటం వల్ల హోంవర్క్‌ ఈజీగా పూర్తి అవుతుంది. కానీ భోజనం చేసిన వెంటనే లేదా నిద్రకు ముందు చేయించడం మంచిది కాదు. ఇది శరీర అలసటకు దారి తీస్తుంది. పిల్లల ప్రవర్తనను బట్టి హోంవర్క్ సమయాన్ని ప్లాన్ చేస్తే, వారిలో దృష్టి, పనితీరు మెరుగుపడతాయి. సరైన సమయంతో హోంవర్క్‌ పూర్తి చేయడం పిల్లల స్కూల్‌ ఫలితాలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.

మీ పిల్లలతో హోంవర్క్ చేయించడం ఎలా ?  కరెక్ట్ టైమ్ ఎప్పుడు ?
Best Time For Homework
Follow us on

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. పిల్లలు స్కూల్ కి టైమ్ కి వెళ్లడమే కాదు. టైమ్ కి హోం వర్క్ చేస్తున్నారా లేదా అనేది కూడా తల్లిదండ్రుల బాధ్యతే. ఈ విషయంలో తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతారు. మీ పిల్లలతో హెంవర్క్ చేయించడానికి ఏ టైమ్ కరెక్ట్ గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

హోంవర్క్ టైమ్

పిల్లలకి హోంవర్క్ చేయడమనేది చాలా ముఖ్యం. అయితే పిల్లలు హోంవర్క్ చేయడానికి కరెక్ట్ టైమ్ ని ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేయడం వల్ల ఏకాగ్రతను, పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలా ప్లాన్ చేయాలి, ఎప్పుడు హోంవర్క్ చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే

పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే వెంటనే హోంవర్క్‌ చేయడం చాలా కరెక్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ఈ టైమ్ లో స్కూల్‌లో నేర్చుకున్న విషయాలు గుర్తుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా చేస్తే హోంవర్క్‌ను తేలికగా పూర్తిచేయవచ్చు. ఒకవేళ హోంవర్క్ ని ఈ సమయానికి చేయించలేకపోతే పిల్లలకు లేట్ అయ్యే కొద్ది మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ టైమ్ కి చేయించి చూడండి.

స్నాక్స్ తర్వాత హోంవర్క్

పిల్లలకు హోంవర్క్ కి ముందు ఏవైన హెల్తీ స్నాక్స్ ఇవ్వండి. అవి తిన్న తర్వాతే హోంవర్క్‌ చేయించడం మంచిది. ఇలా తిన్న తర్వాత చేయడం వల్ల పిల్లలకి శక్తిని అందించడమే కాకుండా వారి దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. హోంవర్క్‌ చేసే సమయంలో శరీరం అలసిపోకుండా అలాగే నిదానంగా హోం వర్క్ ని కంప్లీట్ చేస్తారు.

మార్నింగ్ టైమ్

ఉదయాన్నే హోంవర్క్‌ చేయడం చాలా మంచి అలవాటు. మన పెద్దవాళ్లు కూడా వాళ్ల పిల్లలని ఈ సమయంలోనే చదవించేవారు. నిద్ర లేచిన తర్వాత బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇలా చేయడం మంచిదని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ సమయంలో పిల్లలు ఎక్కువ ఎనర్జీతో హోంవర్క్ చేసుకుంటారు. ఇంకా వారానికి చివర్లో లేదా సెలవు రోజుల్లో కూడా ఉదయం 9 నుంచి 10 మధ్య హోంవర్క్‌ చేయించడం వల్ల వారికి ఈజీ అవుతుంది.

లంచ్ తర్వాత హోంవర్క్ ?

పిల్లలు భోజనం చేసిన తర్వాత హోంవర్క్‌ చేయమని చెప్పడం అస్సలు మంచి ఆలోచన కాదు. ఈ సమయంలో శరీరం అలసిపోతుంది. ఇది వారికి చూపు మందగించడం, లేదా నిద్రలోకి జారుకోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి భోజనం తర్వాత కొంత సమయం విశ్రాంతి ఇచ్చి తర్వాత హోంవర్క్‌ చేయమని చెప్పండి.

స్లీపింగ్ టైమ్ లో హోంవర్క్

పిల్లలు నిద్రకు ముందుగా హోంవర్క్ చేయడం అస్సలు మంచి పద్ధతి కాదు. ఇది వారి మానసిక ఒత్తిడిని పెంచుతుంది. పైగా నిద్రలో అంతరాయం కలిగించే అవకాశం కూడా ఉంది. అందుకే నిద్రకు కనీసం ఒక గంట ముందు వారి హోం వర్క్ కంప్లీట్ చేయమని చెప్పడం మంచిది.

పిల్లలందరి ప్రవర్తన ఒకలా ఉండదు. కొంతమంది పిల్లలకి ఉదయాన్నే చదవడం అలవాటు ఉంటుంది. మరికొంత మంది పిల్లలకి సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో చదువుకోవడం ఈజీగా ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు ఏ టైమ్ లో ఇష్టంగా హోం వర్క్ చేస్తారో గుర్తించి వారికి ఆ టైమ్ లోనే హోంవర్క్‌ చేయించడం మంచిది. ఇలా పిల్లల హోం వర్క్ విషయంలో కరెక్ట్ టైమ్ ని ఎంచుకోవడం వల్ల పిల్లలకు బాగా చుదువుకోవడంలో సహాయపడుతుంది.