Vastu Tips: మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు

మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటాం. ఇలాంటి వాటిలో మెట్లు ప్రధానమైనవి. మెట్ల విషయంలో కొందరు తెలిసో తెలియకో పొరపాట్లు చేస్తుంటారు. వీటివల్ల అనే రకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెట్లే కదా ఏమవుతుందే అనుకుంటే పొరబడినట్లే. మెట్ల నిర్మాణంలో వాస్తు లోపాలు ఉంటే అది కుటుంబ సభ్యుల మానసిక స్థితిపై కూడా ప్రభావం...

Vastu Tips: మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
Vastu Tips For Steps
Follow us

|

Updated on: Jul 23, 2024 | 10:45 AM

ఇంటి నిర్మాణంలో వాస్తుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. అందుకే ఇంటి నిర్మాణం అనగానే మొదటగా వాస్తు పండితులను సంప్రదిస్తారు. వారి సూచనల మేరకే ఇంటి నిర్మాణం చేపడుతారు. పునాది మొదలు ఇంటి ద్వారాల వరకు ప్రతీది వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు.

అయితే మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటాం. ఇలాంటి వాటిలో మెట్లు ప్రధానమైనవి. మెట్ల విషయంలో కొందరు తెలిసో తెలియకో పొరపాట్లు చేస్తుంటారు. వీటివల్ల అనే రకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెట్లే కదా ఏమవుతుందే అనుకుంటే పొరబడినట్లే. మెట్ల నిర్మాణంలో వాస్తు లోపాలు ఉంటే అది కుటుంబ సభ్యుల మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇంతకీ మెట్ల విషయంలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి.? లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో మెట్లు ఎప్పుడు నైరుతి లేదా వాయువ్య దిశలోనే ఉండాయి. ఇవే మెట్లకు సరైన దిశగా పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఆనందం, శాంతి, పురోగతి ఉండాలంటే కచ్చితంగా ఇదే దిశలో ఉండాలని చెబుతున్నారు. ఈశాన్యం దిశలో ఎట్టి పరిస్థితుల్లో మెట్ల నిర్మాణం ఉండకూదు. పొరపాటున ఈశాన్యంలో మెట్లను నిర్మిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు.

* ఇక మెట్లు ఎట్టి పరిస్థితుల్లో బేసి సంఖ్యలో ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అంటే మొత్తం మెట్ల సంఖ్య 5,7,9,13,25 ఇలా ఉండాలన్నమాట. మెట్ల సంఖ్య ఇలా బేసి సంఖ్యలో ఉంటేనే సంతోషం, ఆర్థిక పురోగతి లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. అయితే మెట్ల సంఖ్య 17గా ఉండడం మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక మెట్ల కింద ఉండే ఖాళీ స్థలం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మెట్ల కింద వంట గది నిర్మాణం ఉండకదూడు. ఇక సహజంగా మెట్ల కింద బాత్‌రూమ్‌ను నిర్మించుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* మెట్లలో ఏవైనా లోపాలు ఉంటే మెట్ల కింద చీకటి లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మెట్ల ప్రారంభం, చివరిలో గ్రీన్‌ కలర్‌లో ఉండే డోర్‌ మ్యాట్‌లను ఉపయోగించాలి. దీనివల్ల ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి.

* కొంతమంది స్థలం లేని కారణంగా మెట్లను చాలా నిటారుగా నిర్మిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుందని అంటున్నారు. మెట్లను పురోగతికి సూచికగా చెబుతుంటారు. కాబట్టి మెట్లు నిటారుగా ఉండడం మంచిది కాదని అంటున్నారు. ఇక మెట్లను సవ్య దిశలో ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. మెట్లు వక్రమంగా ఉండకూడదు. అలాగే మెట్ల కింద చెప్పులను ఉంచకూడదని చెబుతుంటారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
జీతభత్యాలు పొందే వ్యక్తులు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
జీతభత్యాలు పొందే వ్యక్తులు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఢిల్లీకి జగన్.. 3 రోజుల పాటు అక్కడే...
ఢిల్లీకి జగన్.. 3 రోజుల పాటు అక్కడే...
సొంతింటి కల నెరవేరేదెలా? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ప్రకటన.?
సొంతింటి కల నెరవేరేదెలా? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ప్రకటన.?
మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ పై ఉత్కంఠ
ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ పై ఉత్కంఠ