మొట్ట మొదటి సారి అలా నటిస్తున్న సీనియర్ హీరోయిన్ త్రిష.
Anil Kumar
22 July 2024
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్ త్రిష కూడా డిజిటల్‌లోకి అడుగు పెడుతున్నారు.
ఈ చెన్నై చంద్రం నటిస్తున్న తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘బృంద’ అనే వెబ్ సిరీస్ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్‍లో పోలీస్ ఆఫీసర్ బృందగా నటిస్తున్నారు త్రిష.
చాలా రోజులుగా ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఇక ఇప్పుడు స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్టు తెలుస్తుంది.
ఇక తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్‌లో ఆగస్ట్ 2 నుంచి బృంద వెబ్ సిరీస్ ప్రసారం కానుందని తెలిపారు.
తెలుగులో రూపొందిన ఈ సిరీస్ తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
డైరెక్టర్ సూర్య మనోజ్ వంగాల ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా.. శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందించారు.
ఇందులో ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి