ఎంగిలి చేసిన చపాతీలు.. తింటే ఏంటి.? సోనూ సూద్ షాకింగ్ రియాక్షన్..
TV9 Telugu
23 July 2024
నిన్న మొన్నటి వరకు సేవా కార్యక్రమాలతో నెట్టింట వైరల్ అయిన నటుడు సోనూ సూద్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు.
తాను X అకౌంట్ చేసిన ఓ ట్వీట్ కారణంగా నెటిజన్లు సోను సూద్ ని సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఆ ట్వీట్లో శబరి ఎంగిలి తిన్న రాముడి సీన్‌ను మరోలా చెప్పడం మూలానా.. ! ఇప్పుడు ఓ వర్గం నెటిజన్స్‌కు ఆయన టార్గెట్ అయ్యారు.
ఇక రీసెంట్ గా తాండూరులో ఒక వ్యక్తి.. తన హోటల్లో రోటీ తయారు చేస్తూ దానిపై ఉమ్మి వేశాడు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది.
అయితే ఆ వీడియోను షేర్ చేసిన ప్రముఖ నటుడు సోనూ సూద్.. ఆ వీడియోలో ఉన్న హోటల్ వ్యక్తిని శబరి తో పోల్చాడు.
శబరి రాముడు మిగిల్చిన పండును తింది.. హింసను ఓడించడానికి తాను ఈ సోదరుడు ఎంగిలి రోటీని ఎందుకు తినను...! అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు.
అంతేకాదు మానవత్వం సర్వత్రా వ్యాపింపజేయాలని అన్నారు నటుడు సోనూ సూద్. దీనిపై కొంతమంది నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.
తాజాగా ఈ ట్వీట్ పై బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా నీకు నచ్చినట్టు రామాయణాన్ని మార్చవద్దని సీరియస్ అయ్యారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి