ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడికి సిద్దమైన సినిమాలు..
TV9 Telugu
23 July 2024
రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'పురుషోత్తముడు' సినిమా జూలై 26న థియేటర్లో రిలీజ్ కాబోతోంది. హాసిని సుధీర్ హీరోయిన్.
దునుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'రాయన్' ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంలో జూలై 26న తెలుగులో విడుదల అవుతుంది.
రక్షిత్ అట్లూరి, సంకీర్తన్ విపన్ జంటగా వెంకట సత్య దర్శకత్వం వహించిన చిత్రం 'ఆపరేషన్ రావణ్' జూలై 26న థియేటర్‌లో సందడి చేయనుంది.
హ్యూ జాక్‌మన్ మరియు ర్యాన్ రెనాల్డ్స్ ప్రధాన పాత్రల్లో నటించిన డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్ చిత్రం జూలై 26న థియేటర్లలోకి రానుంది.
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం రాజు యాదవ్ జూలై 24న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
హిందీ చిత్రం భయ్యా జీ ZEE5లో జూలై 26న ప్రసారం కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మనోజ్ బాజ్‌పేయి వందో చిత్రం.
అవికా గోర్ ప్రధానపాత్రలో కనిపించిన హారర్ థ్రిల్లర్ బ్లడీ ఇష్క్ జూలై 26, 2024న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదుల కానుంది.
హాస్యనటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ సిరీస్ చట్నీ సాంబార్ జూలై 26న డిస్నీ+ హాట్‌స్టార్‌లో రానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి