TATA: టాటా సుమోకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.? ఇంట్రెస్టింగ్ కథనం..

అయితే కాలక్రమనేణ కంపెనీలు అధునాతన ఫీచర్లతో కూడిన ఎస్‌యూవీ కార్లను తీసుకొచ్చాయి. టాటా సుమో కారును 1994లో టాటా మోటర్స్‌ తొలిసారి లాంచ్‌ చేసింది. తక్కువ ధరలో తీసుకొచ్చిన ఈ కారు టాక్సీ వాళ్లకు బాగా ఉపయోగపడింది. కేవలం మూడేళ్లలోనే ఏకంగా లక్షకుపైగా కార్లను విక్రయించి టాటా సరికొత్త రికార్డును సృష్టించింది. ఆ తర్వాత ఈ వాహనంలో పలు...

TATA: టాటా సుమోకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.? ఇంట్రెస్టింగ్ కథనం..
Tata Sumo
Follow us

|

Updated on: Aug 29, 2024 | 10:21 AM

టాటా సుమో.. ఈతరం వారికి ఈ కారు పెద్దగా పరిచయం లేకపోయినా, 90ల్లో వారికి కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ కార్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే ఎస్‌యూవీలు, ఎక్స్‌యూవీలు ఉన్నాయి కానీ ఒకప్పుడు మాత్రం టాటా సుమోలే ఎక్కువగా ఉండేవి. ఎక్కువగా కలిసి ప్రయాణించాలంటే ఏకైక మార్తం ఈ వాహనాలే. పది మంది సీటింగ్ కెపాసిటీతో వచ్చిన ఈ కారు అప్పట్లో ఓ సంచలనం.

అయితే కాలక్రమనేణ కంపెనీలు అధునాతన ఫీచర్లతో కూడిన ఎస్‌యూవీ కార్లను తీసుకొచ్చాయి. టాటా సుమో కారును 1994లో టాటా మోటర్స్‌ తొలిసారి లాంచ్‌ చేసింది. తక్కువ ధరలో తీసుకొచ్చిన ఈ కారు టాక్సీ వాళ్లకు బాగా ఉపయోగపడింది. కేవలం మూడేళ్లలోనే ఏకంగా లక్షకుపైగా కార్లను విక్రయించి టాటా సరికొత్త రికార్డును సృష్టించింది. ఆ తర్వాత ఈ వాహనంలో పలు మార్పులు చేసి, అధునాతన ఫీచర్లను జోడించి 2002లో సుమో+ పేరుతో కొత్త వాహనాన్ని తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే అసలు టాటా సమోకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.? ఒక ఉద్యోగికి పనితీరుకు నిదర్శనంగా అతని పేరు మీదే ఈ పేరు పెట్టారు. ఇంతకీ ఆ ఉద్యోగి చేసిన పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టాటా మోటార్స్‌లో పనిచేసే ఎగ్జిక్యూటివ్స్‌లో ఓ సీనియర్‌ ఉద్యోగి అందరూ భోజనం చేసే సమయంలో బయటకు వెళ్లేవారు. అతని పేరే సుమంత్‌ మూల్‌గావ్కర్‌. భోజనం చేసే సమయంలో సుమంత్‌ ఎటు వెళ్తున్నాడో తెలుసుకోవాలని తోటి ఉద్యోగులకు ఆసక్తి కలిగింది.

Sumo

దీంతో ఓ రోజు సుమంత్‌ ఏం చేస్తున్నాడో చూసేందుకు వెళ్లారు. రోడ్డు పక్కన ఉన్న దాబా హోటల్‌ వద్ద ట్రక్కు డ్రైవర్లతో అతను రోజూ ఏదో మాట్లాడుతుండడం గమనించారు. వాహనాలు నడపడంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ, వారి నుంచి సలహాలు స్వీకరిస్తున్నారని తెలుసుకున్నారు. ఈ విషయాలు తెలుసుకున్న సుమంత్‌ ఆర్‌ అండీ విభాగంలో పనిచేసే వారితో చర్చించి.. వాహనం డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయాలో సూచించేవారు. ఇలా పుట్టుకొచ్చిందే టాటా సుమో వాహనం. ఇయన సేవలకు గుర్తింపుగానే టాటా సుమో అనే పేరు పెట్టారు. SUMOలో ‘SU’ అంటే సుమంత్‌, ‘MO’ అంటే మూల్‌గావ్కర్‌. ఆయన పేరు వచ్చేలా ఈ కారుకు ఆ పేరు పెట్టారు. సుమంత్‌ మూల్‌గావ్కర్‌కు పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించారు. ఇదండీ టాటా సుమో పేరు వెనకాల ఉన్న అసలు కథ.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..

మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో