లాంగ్ గ్యాప్ తరువాత మళ్లీ బిజీ అవుతున్న నాటి హీరోయిన్ మమతా మోహన్ దాస్

Anil Kumar

29 August 2024

ఒకప్పుడు ట్రేండింగ్ హీరోయిన్ గా రాణించిన భామల్లో మమతామోహన్ దాస్ ఒకరు. అప్పట్లో ఈమెకి క్రేజ్ బాగుంది.

ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా ఈ ముద్దుగుమ్మకు విపరితమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.

నటిగానే కాదు సింగర్ గాను మమతా చాలా ఫెమస్ అయ్యారు. ఆమె ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడి అలరించారు.

కృష్ణార్జున, విక్టరీ, చింతకాయల రవి, కింగ్‌ ఇలా పలు తెలుగు సినిమాల్లో నటించిన ఈ భామకి స్టార్ డం దక్కలేదు.

ఆ తరువాత తమిళ, కన్నడ భాషల్లో యాక్ట్‌ చేసినా మమతాకు ఎక్కువగా మలయాళంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

గతేడాది రుద్రంగి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. అలాగే మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

ప్రస్తుతంలో తమిళంలో విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

సోషల్ మీడియాలో మమతా కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫొటోస్ ఎప్పుడెప్పుడు షేర్ చేస్తుందా అని చూసే ఫ్యాన్స్ ఉన్నారు.