పిల్లలు దైవంతో సమానం అంటారు. కావాలకున్నదని చెంతచేరే వరకు అల్లరి చేయడం.. అనుకున్నది చేతుల్లో ఉంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందపడడం.. ఎంతటి మానసిక సంఘర్షణను అనుభవిస్తున్న వ్యక్తి అయిన.. పిల్లల ముఖాలపై చిరునవ్వులు చూస్తే తమ కష్టమంతా మర్చిపోతారు. పిల్లలను గొప్ప మార్గదర్శకులుగా తీర్చిదిద్దేది ఒకటి ఇల్లు.. మరొకటి బడి.. ఇంట్లో అమ్మ మొదటి గురువు కాగా.. బడిలోని టీచర్లు రెండవ గురువులు.. చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి పిల్లల వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఉన్నతంగా ఆలోచించేలా చేస్తే శిఖరాలను అవలీలగా అధిరోహిస్తారు.. ఇంట్లో పిల్లలతో మాట్లాడే విధానం.. వ్యవహరించే తీరుతోనే వారి ప్రవర్తన ఉంటుంది. అందుకే మంచి.. చెడు రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వీలైనంతవరకు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇచ్చింది తీసుకోవడమే తప్ప లాక్కోవడం తెలియని పిల్లలకు తల్లిదండ్రులు నేర్పిన విషయాలను మనసులో ముద్రించుకుంటారు. అందుకే ఈ బాలల దినోత్సవం రోజున మీ పిల్లలతో కాసేపు ముచ్చటించాలి. అవసరమైన విషయాలను వారితో చర్చించాలి. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మీ పిల్లలతో జవహర్ లాల్ నెహ్రూ మాటలను గుర్తు చేయండి.. వారికి ఇలా విషెస్ తెలపండి.
పిల్లలు ఉద్యానవనంలో మొగ్గలవంటి వారు. అందుకే వారు ప్రేమతో పెంచితే.. రేపటి నిజమైన పౌరులుగా మారతారు. భవిష్యత్తు పై దృష్టి సారిస్తారు. – పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
నేటి పిల్లలు రేపటి భవిష్యత్ భారత దేశాన్ని నిర్మిస్తారు. తల్లిదండ్రులు వారిని పెంచే విధానమే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. – పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
పెద్దలకు సమయం ఉండకపోవచ్చు.. కానీ పిల్లల కోసం తగినంత స్మయం కేటాయించాలి. -పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
సరైన విద్య ద్వారా మాత్రమే సమాజం యొక్క మెరుగైన క్రమాన్ని నిర్మించవచ్చు. – పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారులు మాత్రమే.. మీ మనసులోని బాధలను చెరిపేస్తారు.. -పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
భవిష్యత్తు అందంగా ఉండాలంటే.. ముందు వారికి మనుషులు ఎలా ఉండాలో నెర్పించాలి. మంచి పాఠాలు నెర్పితే.. భవిష్యత్తు సులభంగా నిర్ణయిస్తారు. -పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
Also Read : Lottery News: కొడుకు చెప్పాడని లాటరీ టికెట్ కొంది..ఇంటికి వచ్చిన అతిథి తెచ్చిన లక్షలను చూసి
Suriya JaiBhim: మంత్రి చేసిన ఆరోపణలను ఖండించిన సూర్య.. జైభీమ్ గురించి ఆసక్తికర విషయాలు..