ఈరోజు అంటే మార్చి 25వ తేదీ సోమవారం హోలీ పండుగ జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు హోలీతో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. హోలీ పండుగ రోజున ఏర్పడనున్న ఈ గ్రహణం ఉదయం 10.24 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.01 గంటల వరకు ఉంటుంది. దాదాపు 4 గంటల 36 నిమిషాల పాటు గ్రహణం కొనసాగనుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం కన్యారాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పెనుంబ్రల్ చంద్రగ్రహణం అవుతుంది. ఈశాన్య ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, రష్యా, ఐర్లాండ్, ఇంగ్లండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. సాధారణంగా చంద్రగ్రహణం ప్రారంభమయ్యే 9 గంటల ముందు సూతకం జరుగుతుంది. అయితే, ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. అరుదైన ఈ చంద్రగ్రహణం 100 సంవత్సరాల తర్వాత సోమవారం ఏర్పడుతోంది. చివరిసారిగా 1924లో హోలీ రోజునే చంద్రగ్రహణం ఏర్పడింది. ఉదయం 9.05 – హోలీ శుభ సందర్భంగా చంద్రగ్రహణం నీడ పడబోతోంది. ఈ చంద్రగ్రహణం ఉదయం 10:24 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:01 గంటలకు ముగుస్తుంది.
హోలీ రోజున సంభవించనున్న ఈ చంద్రగ్రహణాన్ని పెనుంబ్రల్ చంద్రగ్రహణంగా అభివర్ణిస్తున్నారు. విశేషమేమిటంటే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది గ్రహణం కారణంగా ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరంలేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది భారత్‌లో కనిపించదు కాబట్టి. అందువల్ల హోలీపై ఎలాంటి ప్రభావం ఉండదు. హోలీని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుపుకోవచ్చు.
ఈశాన్య ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, రష్యా, ఐర్లాండ్, ఇంగ్లండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, పసిఫిక్, అట్లాంటిక్ వంటి ప్రదేశాలలో ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం హోలీ రోజున ఏర్పడనుంది. ఆర్కిటిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి