ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్ల కొత్త అడిక్షన్‌గా మారాయి. ప్రతిరోజూ వందల కొద్దీ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్ మీడియా వేదికల్లో మిలియన్ల మంది నెటిజన్లను ఆకర్షిస్తూ వైరల్ అవుతున్నాయి. తాజాగా మీ ఐ ఫోకస్ ఏ పాటిదో తెలుసుకునేందుకు అలాంటి ఓ ఫోటోను మీ ముందుకు తీసుకువచ్చాం. ఇది మీకు ఓ రకమైన సవాలే. మీరు దాన్ని కనిపెడితే మీరు సూపర్ దృష్టి కలవారని ఒప్పుకోవాల్సిందే. మీరు సవాళ్లను ఏ కోణంలో చూస్తారు, అర్థం చేసుకుంటారు అనే విషయాలపై ఆధారపడి ఈ చిక్కు పజిల్స్ ఉంటాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల నెటిజన్లను ఈ ఆప్టికల్ ఇల్యూషన్ గేమ్‌పై బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
మీరు పైన చూస్తున్న ఫోటోలో కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా..! వాటి మధ్య భారీ పాము ఉంది. చుట్ట చుట్టుకుని అక్కడే సేదతీరుతుంది. మీరు స్మార్ట్ అనుకుంటున్నారేమో.. ఆ పాము ఇంకా ఇస్మార్ట్. అందుకే పచ్చని చెట్ల కింద ఎవరికీ కనిపించకుండా నక్కి ఉంది. అయితే 8 సెకన్లలోనే మీరు ఆ పామును కనిపెట్టాలి. అప్పుడే మీ ఐ పవర్ అదుర్స్ అని ఒప్పుకుంటాం. ఒక నిమిషంలో లోపల కనిపెడితే ఓకే. అంతకుమించి టైమ్ తీసుకుంటే మాత్రం.. మీ ఫోకస్ సరిగ్గా లేనట్లే.
ఆ పామును కనిపెట్టారా..? అయితే నో ఇష్యూస్. ఇప్పటికీ గుర్తించలేకపోతే మదనపడకండి. పాము ఎక్కడ ఉందో క్లూ ఇస్తాం. ఎక్కువగా కుడివైపు నీడ ఉన్న ప్రాంతంలో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు.. అది మీకు కనిపించే ఉంటుంది. ఇంకా దొరకలేదా..? అయ్యే కంగారేం లేదు. ఆ పాము ఎక్కడ ఉందో మేమే దిగువన ఫోటోలో ఇస్తున్నాం. నెక్ట్స్ టైమ్ మరో కిర్రాక్ పజిల్‌తో కలుసుకుందాం. బై.. బై.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి