Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

రాశి ఫలాలలు: గురువారం అక్టోబర్ 3, 2019

మేషం: ఈ రోజు మేష రాశి వారికి అనుకూల పరిస్థితులు కనబడుతోన్నాయి. చేపట్టే పనుల్లో జాప్యం జరిగినా.. నిదానంగా పూర్తవుతాయి. గృహ నిర్మాణ పనులు చేపడతారు. అనారోగ్యం కాస్త బాధిస్తుంది. అనవసర ఆలోచనలకు తావు ఇవ్వరాదు. ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు.

వృషభం: వృషభ రాశి వారికి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు, పలు వివాదాల నుంచి ఈ రోజు మీకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు.

మిథునం: ఈరోజు మిథున రాశివారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదముంది. కావున జాగ్రత్తలు అవసరం. ఆర్థిక సమస్యలు చక్కబడుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం. అలాగే.. వృత్తి, ఉద్యోగ, వ్యాపారల్లో మార్పులు చేర్పులు ఉంటాయి.

కర్కాటం: ఈరోజు కర్కాటక రాశివారు ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారు. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగంలో.. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థికంగా.. బలపడతారు. ఎక్కువగా ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్యం పదిలం.

సింహం: వీరికి ఈ రోజు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. సంతోషంగా ఉంటారు. కుటుంబసభ్యులతో.. ఏవైనా తగాదాలు ఉంటే.. అవి తొలగిపోతాయి. ఉద్యోగాల్లో ట్రాన్స్‌ఫర్ లేదా ప్రమోషన్స్‌ ఉన్నాయి. కావున ఆందోళన చెందకండి. స్నేహితులను కలిసుకుంటారు. కానీ.. ఓ ముఖ్యసమాచారం మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురిచేస్తుంది. ఆరోగ్యం పదిలం.

కన్య: ఈ రోజు కన్య రాశి వారికి ఆశాజనక పరిస్థితులు కనబడుట లేదు. ఏ విషయంలోనైనా తొందర పాటు అనవసరం. అది భవిష్యత్తులో మీకు పలు సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఆర్థికంగా బావుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగంలో మార్పులు చేర్పులు.

తుల: ఈ రోజు తుల రాశి వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. అదనపు బాధ్యతలు పెరిగినా.. సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజంతా ఆనందంగా గడుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలం.

వృశ్చికం: ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సానుకూలంగా.. వ్యవహరించడం. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే ప్రమాదముంది. బద్దకానికి, అసూయకి తావునివ్వకండి. ఆర్థికంగా బావుంటుంది. ఈరోజు ఉల్లసంగా.. సంతోషంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి.

ధనుస్సు: ఈరోజు ధనుస్సు రాశి వారికి చికాకులు నెలకొంటాయి. ముఖ్యంగా ఉద్యోగంలో.. ఆచితూచి వ్యవహరించడం మంచింది. ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయి. అవకాశాలు అందివస్తాయి. ఒత్తిడికి గురి కావద్దు. ఆందోళన చెందవద్దు. ఇతర ప్రవర్తన వల్ల కాస్త కలత చెందుతారు. ఆరోగ్యం బావుంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.

మకరం: ఈరోజు మకరరాశి వారు ఆనందంగా గడుపుతారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే.. మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. వాయిదా పడుతోన్న పనులు కాస్తా.. పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో.. విదేశీయానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో అనుకూలం.

కుంభం: ఈరోజు కుంభ రాశివారు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఏమరుపాటుగా అస్సలు ఉండకండి. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థికంగా బావుంటుంది. కుటుంబంలో సమస్యల వల్ల కలత చెందుతారు. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి.

మీనం: సంతానం నూతన విద్య, సాంకేతిక ఉద్యోగవకాశాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బావుంది.