కార్పొరేట్ సంస్థల వల్లే ఉద్యోగాలు

ఐదేళ్లలో మనం సాధించిన పేటెంట్ల సంఖ్య మూడు రెట్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బలమైన దేశం కోసం.. బలమైన పౌరుడు అనే విధానంతో ముందుకెళ్తామన్నారు. బలమైన గాలులు వీచినా దీపం వెలుగుతుందన్నారు. సంస్కరణలు, పనితీరు, మార్పు దిశగా ముందుకెళ్లడం ప్రభుత్వ విధానమని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఉపాధి, ఉద్యోగ కల్పన కీలకమన్నారు. తక్కువ అధికారం, ఎక్కువ పరిపాలన పద్ధతిలో నడుస్తున్నామని ఆమె తెలిపారు. భారత్‌ ఇంజినీరింగ్‌ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామని […]

కార్పొరేట్ సంస్థల వల్లే ఉద్యోగాలు
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2019 | 2:23 PM

ఐదేళ్లలో మనం సాధించిన పేటెంట్ల సంఖ్య మూడు రెట్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బలమైన దేశం కోసం.. బలమైన పౌరుడు అనే విధానంతో ముందుకెళ్తామన్నారు. బలమైన గాలులు వీచినా దీపం వెలుగుతుందన్నారు. సంస్కరణలు, పనితీరు, మార్పు దిశగా ముందుకెళ్లడం ప్రభుత్వ విధానమని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఉపాధి, ఉద్యోగ కల్పన కీలకమన్నారు. తక్కువ అధికారం, ఎక్కువ పరిపాలన పద్ధతిలో నడుస్తున్నామని ఆమె తెలిపారు. భారత్‌ ఇంజినీరింగ్‌ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు, వాహనాలు కొనేవారికి రాయితీలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇక చట్టబద్ధంగా వచ్చే ఆదాయాలను చిన్నచూపు చూడబోమని.. పాలసీ స్తంభన, లైసెన్స్‌ కోటా కంట్రోల్‌ పరిపాలన వంటి రోజులు ఇప్పుడు లేవని చెప్పారు. భారత కార్పొరేట్‌ సంస్థలే భారత్‌కు ఉద్యోగాలు కల్పిస్తున్నాయని తెలిపారు.