వీవీప్యాట్ల లెక్కింపుపై ఈసీకి ఆదేశాలు..! హైకోర్టులో పిటిషన్..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎంల కంటే ముందు 5 వీవీప్యాట్‌లు కౌంటింగ్ చేయాలని పిటిషనర్ కోరారు. ఇందులో ఏదైనా తేడా వస్తే అన్ని వీవీప్యాట్‌లు లెక్కించేలా ఈసీని ఆదేశించాలన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ కాసేపట్లో ప్రారంభం కానుంది. జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలోనే వాదనలు జరగనున్నాయి. ఈవీఎంల చివరి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక 5 వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించడానికి బదులు.. ప్రారంభంలోనే స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈవీఎంల లెక్కింపు […]

వీవీప్యాట్ల లెక్కింపుపై ఈసీకి ఆదేశాలు..! హైకోర్టులో పిటిషన్..
Follow us

| Edited By:

Updated on: May 21, 2019 | 11:11 AM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎంల కంటే ముందు 5 వీవీప్యాట్‌లు కౌంటింగ్ చేయాలని పిటిషనర్ కోరారు. ఇందులో ఏదైనా తేడా వస్తే అన్ని వీవీప్యాట్‌లు లెక్కించేలా ఈసీని ఆదేశించాలన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ కాసేపట్లో ప్రారంభం కానుంది. జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలోనే వాదనలు జరగనున్నాయి.

ఈవీఎంల చివరి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక 5 వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించడానికి బదులు.. ప్రారంభంలోనే స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈవీఎంల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చాయో తెలిసిపోతుందని.. ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడం వల్ల ఉపయోగం లేదని పిటిషన్‌లో తెలిపారు. చివర్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడం ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనను ఉల్లంఘించడమేనన్నారు.

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈసీ ఇప్పటివరకు తగిన ఉత్తర్వులు జారీ చేయలేదని పిటిషనర్ తెలిపారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈవీఎంల లెక్కింపునకు ముందే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఈసీని ఆదేశించాలని కోర్టును కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కేబినెట్ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.