ఏపీలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు..

ఏపీలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు-పశ్చిమ షేర్ జోన్ 19.0 డిగ్రీల వెంబడి పెనిన్సులర్ భారతదేశం మీదుగా 4.5 కి.మీ నుండి 7.6 కి.మీ ఎత్తు మధ్యలో కొనసాగుతోంది.

ఏపీలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు..
Follow us

|

Updated on: Aug 16, 2020 | 8:28 PM

Rains In AP: ఏపీలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు-పశ్చిమ షేర్ జోన్ 19.0 డిగ్రీల వెంబడి పెనిన్సులర్ భారతదేశం మీదుగా 4.5 కి.మీ నుండి 7.6 కి.మీ ఎత్తు మధ్యలో కొనసాగుతోంది. అటు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో షుమారు ఆగస్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రేపు ,ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు విశాఖపట్నం జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయంది. అలాగే ఉత్తర కోస్తాంధ్రా, యానాంలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే కృష్ణ జిల్లా, దక్షిణ కోస్తాంధ్రాలో రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు.. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అయితే రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..