World Menstrual Hygiene Day 2022: దేశం మొత్తం జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది.. ముఖ్యంగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కలిగిస్తుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం.. మహిళల్లో రక్తహీనత ఉన్న 180 దేశాల్లో భారతదేశం 170వ స్థానంలో ఉంది. ముఖ్యంగా యుక్తవయస్సులోని బాలికలు వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలికలు ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సమస్య రక్తహీనత అని.. దీనికి కారణం ఋతు పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం కారణమని పేర్కొన్నారు. మహిళల్లో రక్తహీనతకు ముఖ్య కారణం.. అధిక ఋతుస్రావం వలన రక్తం కోల్పోవడమే అని నివేదికల ద్వారా తెలుస్తోంది.
ఈ రక్తహీనత మహిళల్లో ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. శారీరక ఎదుగుల పై ప్రభావితం చూపిస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థపై అధికంగా ప్రభావం చూపుతుంది. బాలికలు అంటువ్యాధుల బారిన పడుతున్నారు. రుతుక్రమం సమయంలో చక్కెర, ఉప్పు, కొన్ని రకాల మాంసంతో చేసిన ఆహార పదార్థాలను తినడం వలన కూడా చిన్న వయసులోనే రక్తహీనత బారిన పడుతున్నారు. అంతేకాదు ఇలా రక్తహీనత బారిన పడడం వల్ల.. యుక్త వయసులోని బాలికల శారీరక సామర్థ్యం, పని పనితీరుపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది.
2021లో విడుదలైన ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 మిలియన్ల మంది మహిళలు, బాలికలకు రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణకు తగిన సౌకర్యాలు లేవని వెల్లడైంది. పాఠశాలలు, ఆఫీసులు, ఆరోగ్య కేంద్రాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో సరైన పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడం వలన కూడా పరిశుభ్రతను పాటించడం లేదని తెలుస్తోంది. వీటికి తోడు భారతదేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు సౌకర్యాలు లేవు. అంతేకాదు రుతుక్రమ సమయంలో ఉపయోగించిన శానిటేషన్ నాప్‌కిన్‌లను పారవేసేందుకు తగిన మార్గాలు కూడా అందుబాటులో లేకపోవడం వలన మహిళలు, బాలికలు సురక్షితమైన ఋతు పరిశుభ్రత విషయంలో వెనుకబడి ఉన్నారు.
అంతేకాకుండా.. ఇప్పటికీ ఋతుస్రావం సమయంలో స్త్రీలను అపవిత్రంగా భావిస్తారు. రుతుక్రమ సమయంలో మహిళలతో సంబంధాలు పాపాత్మకంగా భావించడమే కాదు.. అనేక నియమనిబంధనలను నేటికీ పాటిస్తారనడంలో అతిశయోక్తి కాదు. ఇక ఋతు పరిశుభ్రత నిర్వహణలో లోపం తో పాటు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు కూడా మూత్ర లేదా పునరుత్పత్తి మార్గం వ్యాధుల బారిన పడతాయి. ఈ ఇన్ఫెక్షన్ల కారణంగా రుతుక్రమం సమయంలో విపరీతమైన రక్త నష్టానికి దారితీస్తాయి.. చివరికి రక్తహీనత వ్యాధి బారిన పడేలా చేస్తాయి.
2021లో విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం ప్రసవ వయస్సులో ఉన్న మహిళల్లో 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తెలుస్తోంది. దీంతో ప్రపంచంలోనే ప్రసవ సమయంలో రక్తహీనతతో బాధపడే మహిళలు మనదేశంలోనే భారీ ఉన్నట్లు లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 57.5 శాతం మంది సాధారణ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు.
కనుక మహిళల్లో ఋతు పరిశుభ్రత నిర్వహణ గురించి ఋతుస్రావం గురించి అవగాహనను కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన కొన్ని చర్యలను వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఋతు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడంతో పాటు.. అందుకు తగిన విధంగా సంఘాలను సమీకరించడం తో పాటు రుతుస్రావం చుట్టూ ఉన్న నిషేధాల పట్ల స్త్రీలకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఇక రుతుక్రమం సమయంలో ఉపయోగిస్తున్న హానికరమైన పద్ధతులను నివారించే దిశగాబహిష్టు పరిశుభ్రత నిర్వహణపై తల్లులకు శిక్షణ కార్యక్రమం చేపట్టాలి.
ప్రభుత్వ పథకాలు:
యుక్తవయస్సులో ఉన్న బాలికల్లో రుతుక్రమ పరిశుభ్రతను ప్రోత్సహించే ఋతు పరిశుభ్రత పథకం (MHS) వంటి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవడం ద్వారా పాఠశాలల్లో అనుకూల వాతావరణాన్ని సృష్టించాల్సి ఉంది. అంతేకాదు స్కూల్స్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ కు క్లాత్ ప్యాడ్‌ల వంటి శానిటరీ నాప్‌కిన్‌లుగా స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న ప్రత్యామ్నాయాలను అందించాలి. శానిటరీ నాప్‌కిన్‌ల తయారీలో పని చేసే స్వయం సహాయక బృందాలు, వ్యవస్థాపకులకు తగిన సహాయసహకారాలను అందించాలి.
ఈ చర్యలు ఋతు పరిశుభ్రత విషయంలో సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి అమలు చేయగల కొన్ని పరిష్కారాలు. అయినప్పటికీ.. ఋతు పరిశుభ్రత విషయంలో మహిళలకు సంబంధించిన దేశవ్యాప్త డేటా అవసరం. ఇది రుతుక్రమం సమయంలో బాలికలు తీసుకోవాల్సిన వివిధ నివారణ చర్యలను తెలియజేస్తుంది. అంతేకాదు వారి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలు అమలు చేయడంలో సహాయపడుతుంది.(Source)
మరిన్ని హెల్త్ ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..