PCOS అనేది ఈ రోజుల్లో స్త్రీలలో సాధారణంగా కనిపించే సమస్య అని చెప్పవచ్చు. PCOS ప్రధాన లక్షణాలలో ఒకటి. రెగ్యులర్ గా పీరియడ్స్ రాకపోవడం, శరీరంలో హార్మోన్ల బ్యాలెన్స్ లేకపోవడం కారణంగా ఇది జరుగుతుంది. PCOS ఉన్న స్త్రీల శరీరం సాధారణ స్థాయి కంటే ఎక్కువ పురుష హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. పిసిఒఎస్‌తో బాధపడుతున్న మహిళలు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డాక్టర్లు చెబుతున్నారు.
పండ్లు, తాజా కూరగాయలు, బీన్స్, కాయధాన్యాలు, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ పాల విషయంలో కూడా PCOS ఉన్న మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి పీసీఓఎస్ ఉన్న మహిళలు పాలు తీసుకోకూడదా అనే విషయం తెలుసుకుందాం.
పోషకాహార నిపుణుడు లవ్‌నీత్ బాత్రా ప్రకారం PCOS ఉన్న మహిళలు పాల ఉత్పత్తులను తీసుకోకపోవడం, పాలను అవాయిడ్ చేయడం ఉత్తమం. ముఖ్యంగా మీ టెస్టోస్టెరాన్ లేదా ఆండ్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే వెంటనే పాలను మానేయడం మంచిది. ఎందుకంటే స్కిమ్డ్ మిల్క్ మీ శరీరంలో ఇన్సులిన్, ఆండ్రోజెన్ స్థాయిలను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మరింత హార్మోన్ల బ్యాలెన్స్ ను దారి తప్పిస్తుంది. అయితే పీసీఓఎస్ ఉన్న మహిళలు దేశీయ ఆవు పాలను తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అది కూడా రోజుకు అరగ్లాసు మాత్రమే తీసుకోవాలి.
పిసిఒఎస్ ఉన్న మహిళలు తినకూడని పదార్థాలు ఇవే:
PCOSతో బాధపడుతున్నప్పుడు, మీరు మీ బరువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన బరువును మెయిన్ టెయిన్ చేయాలి, మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చాలి. ఇవి కాకుండా చేపలు, ఆకు కూరలు, టొమాటోలు, బెర్రీలు, నట్స్, పసుపు, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవాలి. ఇది కాకుండా, మీరు చేపలను తినవచ్చు. PCOSతో బాధపడుతున్న మహిళలకు చేప మాంసం ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. చికెన్, మటన్ లకు దూరంగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి మీ ఆహార పదార్థాల్లో తెల్లటి పదార్థాలు అంటే బియ్యం, మైదా, పంచదార, పాలు, ఉప్పును దూరం ఉంచాలి. వీలైతే చాలా కొద్ది పరిమాణంలో తీసుకోవాలి.
PCOS ఉన్న మహిళలు కార్బోనేటేడ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ తీసుకోకుండా ఉండాలి. శరీరంలో మంట పుట్టించే ఆహారాలు ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, మైదా పిండి, జంక్ ఫుడ్ వంటి వాటిని తీసుకోకూడదు. ఇది కాకుండా, ఫాస్ట్ ఫుడ్ , వేయించిన వస్తువులకు దూరంగా ఉండాలి.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..