Shigella Bacteria: షిగెల్లా బ్యాక్టిరియా ఎఫెక్ట్‌.. కేరళలో తొలి మరణం.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు..

|

May 05, 2022 | 11:42 AM

Shigella Bacteria: షిగెల్లా బ్యాక్టిరియా వల్ల దేశంలో తొలి మరణం సంభవించింది. కేరళలో పదహారేళ్ల అమ్మాయి దేవానంద దీని బారినపడి చనిపోయింది.

Shigella Bacteria: షిగెల్లా బ్యాక్టిరియా ఎఫెక్ట్‌.. కేరళలో తొలి మరణం.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు..
Shigella Bacteria
Follow us on

Shigella Bacteria: షిగెల్లా బ్యాక్టిరియా వల్ల దేశంలో తొలి మరణం సంభవించింది. కేరళలో పదహారేళ్ల అమ్మాయి దేవానంద దీని బారినపడి చనిపోయింది. ఇప్పటికే చాలామంది షిగెల్లా బ్యాక్టిరియా బారిన పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బ్యాక్టిరియా సోకిన ఆహారాన్ని తినడం వల్ల అతడి నుంచి పక్క వారికి ఇది సోకుతుంది. ఇది ఆహారం ద్వారా సోకే ఒక అంటువ్యాధి. దీంతో కేరళవాసులందరు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. వాస్తవానికి సదరు యువతి కాసరగోడ్ జిల్లాలోని ఓ ఫుడ్ స్టాల్ వద్ద ‘షావర్మా’ అనే వంటకం ఆరగించింది. ఆమెతో పాటూ మరో యాభైమంది విద్యార్థులూ తిన్నారు. వారంతా అనారోగ్యం పాలయ్యారు. ఇక ఈ పదహారేళ్ల అమ్మాయి తిన్న రెండు రోజులకే మరణించింది. ఆమె మరణానికి కారణం తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అని తెలిసింది.

షిగెల్లా అనేది ఒక బ్యాక్టిరియా. దీన్ని షిగెల్లోసిస్ అని కూడా అంటారు. నోటి ద్వారా ప్రవేశించి పేగులపై అధిక ప్రభావం చూపిస్తుంది. ఇది సోకిన వెంటనే మోషన్స్‌ అవుతాయి. ఒక్కోసారి రక్త విరేచనాలు కూడా కావచ్చు. వాంతులు అవుతాయి. ఇది అంటు వ్యాధి. షిగెల్లా బ్యాక్టిరియా సోకిన ఆహారాన్ని తినడం వల్ల, ఆ బ్యాక్టిరియా సోకిన వ్యక్తి నుంచి పక్క వారికి ఇది సోకుతుంది. అందుకే వైద్యులు మల మూత్ర విసర్జన తరువాత కచ్చితంగా చేతులు సబ్బుతో కడుక్కోమని సూచిస్తున్నారు. పదాహారేళ్ల యువతి చనిపోవడంతో కేరళ కోర్టు ఇప్పుడు ఈ కేసును సుమోటాగా స్వీకరించింది. రెస్టారెంట్ యజమాన్యంపై కేసు నమోదు చేయాలని అలాగే ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

షిగెల్లా బ్యాక్టిరియా లక్షణాలు

వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, వికారంగా ఉండడం మొదలైనవాటిని షిగెల్లా బ్యాక్టిరియా లక్షణాలుగా చెప్పవచ్చు. బరువు తగ్గడం, డీహైడ్రేషన్ కు గురవ్వడం, రక్త విరేచనాలు కావడం కనిపిస్తే వెంటనే వైద్యుడిని కలవాలి. తేలికపాటి కేసుల్లో మాత్రం ఇంట్లోనే ఉండి మందులు వాడాల్సి వస్తుంది. ముఖ్యంగా వైద్యులు షిగెల్లా బ్యాక్టిరియాను చంపడానికి యాంటీ బయటిక్స్ ను సూచిస్తారు. ఒక వారంలో బ్యాక్టిరియా బయటికి పోతుంది లేదా నాశనం అవుతుంది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: ఈ ఆర్సీబీ ప్లేయర్ చెన్నైని కోలుకోలేని దెబ్బతీశాడు.. ప్రత్యర్థి జట్లకి హెచ్చరికలు జారీ చేశాడు..!

UPSC Exam Calendar 2023: యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2023 విడుదల.. IAS, NDAతో సహా పలు పరీక్ష తేదీలను తెలుసుకోండి..!

IPL 2022: ముంబై ఇండియన్స్‌కి షాక్.. వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్‌కి నో ఎంట్రీ..!