AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేడి Vs చల్లిటి నీరు.. ఉదయం ఏది తాగితే ఆరోగ్యానికి మంచిది..?

ఉదయం నిద్రలేవగానే మీరు నీళ్లు తాగుతున్నారా..? అయితే మీరు తాగే నీరు చల్లగా ఉందా లేక వేడిగా ఉందా? మీరు తాగే ఆ నీటి ఉష్ణోగ్రతే మీ రోజంతా మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుందని మీకు తెలుసా? అసలు ఉదయం ఖాళీ కడుపుతో ఏ నీరు తాగితే అమృతంతో సమానం? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వేడి Vs చల్లిటి నీరు.. ఉదయం ఏది తాగితే ఆరోగ్యానికి మంచిది..?
Hot Vs Cold Water
Krishna S
|

Updated on: Feb 16, 2026 | 7:28 AM

Share

ఆరోగ్యమే మహాభాగ్యం.. మన ఆరోగ్యం మనం రోజును ఎలా ప్రారంభిస్తామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో నీరు త్రాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే.. గోరువెచ్చని నీరు తాగాలా? లేక చల్లటి నీరు తాగాలా? ఏది మన శరీరానికి అసలైన ప్రయోజనాన్ని అందిస్తుంది? దీనిపై ఆరోగ్య నిపుణుల ఏమంటున్నారు అనేది తెలుసుకుందాం..

ఉదయం నీరు ఎందుకు తాగాలి?

మనం రాత్రిపూట 6 నుండి 8 గంటల పాటు నిద్రపోయినప్పుడు, శరీరం ఎటువంటి ద్రవాలను తీసుకోదు. దీనివల్ల ఉదయానికి శరీరం స్వల్పంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నిద్రలేవగానే నీరు తాగడం వల్ల శరీర అంతర్గత అవయవాలు మళ్లీ చురుగ్గా మారి, జీవక్రియలు యాక్టివేట్ అవుతాయి.

గోరువెచ్చని నీరు: ఒక అమృతం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగడమే అత్యుత్తమ ఎంపిక.

మెరుగైన జీర్ణక్రియ: గోరువెచ్చని నీరు జీర్ణవ్యవస్థను నిద్రలేపి, ఎంజైమ్‌ల పనితీరును మెరుగుపరుస్తుంది.

డీటాక్స్: శరీరంలోని వ్యర్థాలను, విషతుల్యాలను బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

బరువు తగ్గుదల: గోరువెచ్చని నీరు శరీర ఉష్ణోగ్రతను స్వల్పంగా పెంచి, మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. ఇది కేలరీలను కరిగించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

రక్త ప్రసరణ: ఇది రక్త నాళాలను సహజంగా విస్తరింపజేసి, రక్త ప్రసరణను సాఫీగా సాగేలా చేస్తుంది.

మలబద్ధక నివారణ: దీర్ఘకాలిక మలబద్ధక సమస్యతో బాధపడేవారికి గోరువెచ్చని నీరు ఒక చక్కని పరిష్కారం.

చల్లటి నీరు ఎప్పుడు తాగాలి?

ఉదయం నిద్రలేవగానే మరీ చల్లటి నీరు తాగడం అంత మంచిది కాదు. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించడమే కాకుండా గొంతు సమస్యలకు దారితీయవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చల్లటి నీరు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఉదయం వ్యాయామం చేసినట్లయితే, శరీరాన్ని చల్లబరచడానికి, త్వరగా రీహైడ్రేట్ అవ్వడానికి చల్లటి నీరు సహాయపడుతుంది. చల్లటి నీటిని శరీర ఉష్ణోగ్రతకు మార్చడానికి శరీరం కొంత శక్తిని ఖర్చు చేస్తుంది. ఇది స్వల్పంగా కేలరీలను బర్న్ చేస్తుంది.

మొత్తం మీద చూస్తే.. మీ రోజును ఉత్సాహంగా, ఆరోగ్యంగా ప్రారంభించడానికి గోరువెచ్చని నీరు తాగడమే ఉత్తమ మార్గం. ఇది మీ అంతర్గత వ్యవస్థలను శుభ్రపరిచి, రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచుతుంది.

Follow Us
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర