Health: చలికాలం చల్లటి నీటితో తలస్నానం చేస్తున్నారా..? ఈ విషయం తెలుసుకోండి..

|

Dec 30, 2024 | 3:25 PM

కొంతమంది చలికాలంలో కూడా బాగా చల్లటి నీటితో స్నానం చేస్తారు. అయితే చల్లటి నీటితో స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు అజాగ్రత్తగా ఉంటే, స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. దీని గురించి నిపుణులు ఏమనుకుంటున్నారు.. తెలుసుకుందాం పదండి...

Health: చలికాలం చల్లటి నీటితో తలస్నానం చేస్తున్నారా..? ఈ విషయం తెలుసుకోండి..
Cold Bath
Follow us on

చలికాలంలో కూడా కొందరు చల్లటి నీటితో తల స్నానం చేయడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అయితే శీతాకాంలో చన్నీటి స్నానం మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. చల్లటి నీటితో తల స్నానం చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ముందుగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మెదడుకు రక్త ప్రసరణ మందగించినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. దీని కారణంగా మెదడులోని కొన్ని భాగాలకు ఆక్సిజన్ అందదు. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైనది. సకాలంలో చికిత్స చేయకపోతే ఒక వ్యక్తి మరణానికి దారితీస్తుంది.  చల్లటి నీరు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

చల్లటి నీటిని నేరుగా తలపై పోసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. దీనికి కారణం నేరుగా తలపై చల్లటి నీటిని పోసుకున్నప్పుడు మెదడులోని సిరలు అకస్మాత్తుగా కుంచించుకుపోవడం వల్ల రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. అంతే కాకుండా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో బలహీనత, అలసట, తల తిరగడం, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు వస్తాయి.

చల్లటి నీళ్లతో తల స్నానం చేయాలనుకున్నప్పుడు.. మొదట చేతులు, కాళ్లు, వీపు వంటి ఇతర భాగాలపై నీరు పోసుకోవడం సురక్షితం. ఇలా చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.  ఆ తర్వాత తలపై కూడా నీరు పోసుకోవచ్చు. ఈ విధంగా చల్లటి నీరు శరీరంపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. 

ఈ వ్యాధులతో బాధపడుతున్న రోగులు జాగ్రత్త వహించాలి

మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే లేదా మీకు పదే పదే జలుబు చేసే తత్వం ఉంటే.. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది కాకుండా, మీకు అధిక రక్తపోటు లేదా గుండె జబ్బుల సమస్య ఉంటే, చల్లటి నీటితో స్నానం చేయడం మీకు ప్రమాదకరం. సాధారణ నీటితో లేదా గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయండి. 

(ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే.. అనుసరించే ముందు వైద్యులను సంప్రదించండి)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.