హెల్త్ అలర్ట్.. గోళ్ల రంగు మారి, అక్కడ చర్మం మందగించిందా..? వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోండి..

|

Mar 17, 2024 | 11:26 AM

మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి.. చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని పేర్కొనే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత.. దీనికి సరైన ఔషధమంటూ ఏం లేదు.. ప్రస్తుతం ఈ వ్యాధి ప్రపంచాన్నే పట్టిపీడిస్తోంది.

హెల్త్ అలర్ట్.. గోళ్ల రంగు మారి, అక్కడ చర్మం మందగించిందా..? వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోండి..
షుగర్ బాధితులకు ఆకు కూరలు కూడా మేలు చేస్తాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు బచ్చలికూర రసాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బచ్చలికూరలో విటమిన్ ఎ, విటమిన్ బి, సి, ఇ పుష్కలంగా లభిస్తాయి. దీని వినియోగం వల్ల శరీరంలో షుగర్ అదుపులో ఉంటుంది.(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
Follow us on

మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి.. చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ అని పిలుస్తారు. డయాబెటిస్ వ్యాధి ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత.. దీనికి సరైన ఔషధమంటూ ఏదీ లేదు.. ప్రస్తుతం ఈ వ్యాధి ప్రపంచాన్నే పట్టిపీడిస్తోంది. ఒక్కసారి వచ్చిందంటే దీర్ఘకాలికంగా ఉంటుంది. అందుకే ప్రజలు తమ శత్రువులకు కూడా ఈ వ్యాధి రాకూడదని ప్రార్థిస్తారు. ఎందుకంటే ఈ స్థితిలో ఆరోగ్యం పట్ల స్వల్ప అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాంతకంగా మారుతుంది. అయితే, డయాబెటిక్ ను చాలా మంది సకాలంలో గుర్తించకపోవడంతో అత్యవసర పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే డయాబెటిస్ లక్షణాల గురించి తెలుసుకోవాలంటున్నారు నిపుణులు..

మనకు మధుమేహం ఉన్నప్పుడు, మన శరీరం అనేక రకాల సంకేతాలను ఇస్తుంది. మన పాదాలు కొన్ని హెచ్చరిక సంకేతాలను కూడా అందిస్తాయి. అవి సమయానికి గుర్తించాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. దీంతో పరిస్థితి మరింత దిగజారవచ్చు. మీ పాదాలు కొన్ని సంకేతాలను ఇస్తుంటే వెంటనే రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.

పాదాల నుంచి మధుమేహం సంకేతాలు

పాదాలలో నొప్పి: మీరు మధుమేహ బాధితులైనప్పుడు, మీరు డయాబెటిక్ న్యూరోపతితో బాధపడవచ్చు. ఇది ఒక వైద్య పరిస్థితి, దీనిలో నరాలు దెబ్బతింటాయి. దీని కారణంగా కాళ్ళు నొప్పితోపాటు వాపుగా మారవచ్చు. కొన్నిసార్లు కాళ్ళ తిమ్మిరి కూడా ఉంటుంది.

గోళ్ల రంగులో మార్పు: మధుమేహం వచ్చినప్పుడు, మన గోళ్ళ రంగు మారుతుంది. సాధారణంగా లేత గులాబీ రంగులో ఉన్న మన గోర్లు అకస్మాత్తుగా పసుపు రంగులో కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ మార్పును తేలికగా తీసుకోకండి. మీ రక్తాన్ని వెంటనే పరీక్షించుకోండి.

చర్మం గట్టిపడటం: మీకు మధుమేహం ఉన్నప్పుడు, మీ పాదాలు, అరికాళ్ళ చర్మం గట్టిగా మారడం ప్రారంభమవుతుంది. అయితే ఇది బూట్లు, చెప్పుల వల్ల కూడా కావొచ్చు.. ఇలాంటి సమస్య లేకపోతే.. రక్తంలో చక్కెర పరీక్ష చేయించుకోండి. తద్వారా మీరు లక్షణాలను తనిఖీ చేయవచ్చు. మధుమేహం కారణంగా సాధ్యమయ్యే నష్టాలను నివారించడానికి ప్రయత్నించవచ్చు..

పాదాలలో పుండు: మీకు పాదాలలో పుండు, గాయాలు కనిపించడం లాంటి కనిపిస్తే.. అలర్ట్ అవ్వడం మంచిది. కొన్నిసార్లు చర్మం కూడా రావడం ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి పరిమితికి మించి పురోగమిస్తే వాటిని తీసివేయాల్సి వస్తుంది. అందుకే.. మీరు మధుమేహాన్ని సకాలంలో గుర్తించడం.. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..