విటమిన్ D మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి, రోగనిరోధక వ్యవస్థను బలపరచడానికి, క్యాల్షియం శోషణలో సహాయం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ D లేకపోతే శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఎముకల బలహీనత, వ్యాధులకు పోరాడే శక్తి తగ్గడం, ఇంకా ఇతర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే మనం విటమిన్ D అందించే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ D పొందే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్స్ లో విటమిన్ D అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజు గుడ్డును తినడం వల్ల మన శరీరానికి చాలా లాభం ఉంది.
పనీర్ లో కూడా విటమిన్ D ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. పన్నీర్ లో ఉన్న పోషకాలు మన ఆరోగ్యాన్ని పెంచడానికి అవసరం అవుతాయి. ఇది మంచి క్యాల్షియాన్ని అందిస్తుంది.
సోయా పాలు, బాదాం పాలు, ఓట్స్ పాలు వంటి వాటిలో కూడా విటమిన్ D ఉంటుంది. ఇవి శరీరానికి ఆరోగ్యకరమైనవి. ఈ పాలు ఎముకలు బలంగా ఉంచేందుకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతాయి.
పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి. వీటిలో విటమిన్ D కూడా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. పుట్టగొడుగులను ఆహారంలో చేర్చడం కూడా చాలా మంచిది.
పెరుగులో క్యాల్షియం, విటమిన్ D ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పెరుగుని రోజూ తీసుకోవడం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
విటమిన్ D శరీరంలో అనేక విధాలుగా పనికొస్తుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడంలో మాత్రమే కాకుండా.. మన రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. విటమిన్ D లోపం ఉంటే, మన శరీరంలో క్యాల్షియం శోషణ తగ్గిపోతుంది. దీని వల్ల ఎముకలు బలహీనపడతాయి. కొంతకాలం తర్వాత ఈ లోపం అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
విటమిన్ D ను మనం మంచి ఆహారంతో లేదా రోజూ తక్కువ సమయం సూర్యకాంతి పొందడం ద్వారా పొందవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారంలో విటమిన్ D ఉన్న ఆహారాలను చేర్చుకోవడం చాలా అవసరం. అలాగే కచ్చితంగా సూర్యకాంతి కూడా మన శరీరానికి విటమిన్ Dని ఉత్పత్తి చేస్తుంది. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాం.