హార్లే-డేవిడ్సన్ కు కరోనా సెగ.. 700 ఉద్యోగాలు కట్‌..

యూఎస్ కు చెందిన ప్రపంచ ప్రసిద‍్ధ బైక్స్‌ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ కరోనా సంక్షోభంతో ఆర్థిక కష్టాల్లో పడింది. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వందలమంది ఉద్యోగాల తొలగింపునకు నిర్ణయించింది.

హార్లే-డేవిడ్సన్ కు కరోనా సెగ.. 700 ఉద్యోగాలు కట్‌..
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 7:25 AM

యూఎస్ కు చెందిన ప్రపంచ ప్రసిద‍్ధ బైక్స్‌ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ కరోనా సంక్షోభంతో ఆర్థిక కష్టాల్లో పడింది. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వందలమంది ఉద్యోగాల తొలగింపునకు నిర్ణయించింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 700 మంది ఉద్యోగులను  తొలగించనున్నామని ప్రకటించింది. ‘ది రివైర్’  పేరుతో హార్లే-డేవిడ్సన్ ఉద్యోగ కోతలు, పునర్నిర్మాణ ప్రణాళికను ప్రకటించింది. సంస్థ పునర్నిర్మాణం లో భాగంగా 700మంది తొలగించనున్నామని, వీరిలో 200మంది ఇప్పటికే నిష్క్రమించగా, మిగిలిన 500మందిని 2020 చివరి నాటికి తొలగించాలని భావిస్తున్నామని కంపెనీ తెలిపింది.

ఈ చర్యల ద్వారా కంపెనీకి 42 మిలియన్ల డాలర్లు ఖర్చు ఆదా అవుతుంది. హార్లే-డేవిడ్సన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ ఒలిన్ సంస్థకు రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో  తాత్కాలిక ప్రాతిపదికన డారెల్ థామస్‌ను ఎంపిక చేసింది. హార్లే-డేవిడ్సన్‌ను విజయవంతమైన మార్గంలో తీసుకురావడానికి గణనీయమైన మార్పులు అవసరం, అందుకు సరికొత్త దశలో కృషి జరుగుతోందని, మొత్తం కంపెనీ అంతటా వేగంగా నిర్ణయాలు తీసుకుంటామని  హార్లే-డేవిడ్సన్ సీఈఓ జోచెన్ జైట్జ్ ప్రకటించారు.  కాగా ప్రపంచవ్యాప్తంగా హార్లేలో 6,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

Latest Articles