రియల్‌ ఎస్టేట్‌: రెండేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు మటాష్..!

Half a Million Jobs may be lost due to severe cash crunch in Real Estate, రియల్‌ ఎస్టేట్‌: రెండేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు మటాష్..!

వచ్చే మరో రెండు సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు మటాష్‌ కానున్నాయా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కుదేలు అయిన క్రమంలో రాబోయే రెండేళ్లలో దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు కోల్పోయే అవకాశముందని.. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అంచనా వేసింది.

ఒక పక్క ఆర్థిక మందగమనం.. మరో పక్క ఉద్యోగాల సమస్యలు.. సగటు మానవుడి జీవితం దుర్భరమనే చెప్పవచ్చు. ప్రతీఏటా.. కాలేజీల్లో చదువుకుని.. బయటకొచ్చిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది కానీ.. ఉద్యోగాలు మాత్రం ఉండటం లేదు. చదువులు ముగించుకుని బయటకొచ్చిన కాన్నించి.. ఉద్యోగాలపై వేట మొదలు పెడుతూనే ఉన్నారు. కానీ.. ఏవీ ఉద్యోగాలు..? ఎంతమందికని ఉద్యోగాలు ఉంటాయి? డబ్బున్నవాళ్లు.. ఏదో ఒక వ్యాపారం చేస్తూంటారు. మరి మధ్య తరగతి కుంటుంబాల సంగతే దారుణంగా ఉంటుంది. ఇంతా.. చదువుకుని ఉద్యోగం లేకపోతే.. ఆ పరిస్థితే వేరు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రవేశ పెట్టామని చెబుతాయే కానీ.. అవి కేవలం కంటి తుడుపు చర్యలే.

ఇక చాలా మంది.. బ్యాంకింగ్, టెలికాం, సాఫ్ట్‌వేర్ రంగాలపై ఆధారపడుతూంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కుదేలు కావడంతో.. అక్కడ కూడా ఉద్యోగాల కొరత ఏర్పడి.. దినదిన గండంగా మారనుంది. అలాగే.. ఈ సమస్య పరోక్షంగా.. సిమెంట్, స్టీల్ అనుబంధ పరిశ్రమలపై కూడా పడనుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో.. లక్షల్లోనే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని అంటున్నారు. మళ్లీ రియాల్టీ, కన్‌స్ట్రక్షన్ రంగాలు తిరిగి జనసత్వాలు పొందే దిశగా ఉండాలంటే.. కేంద్ర ప్రభుత్వం వాటికనుగుణంగా చర్యలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *