అందుకే కాల్పులు జరిగాయి.. నార్సింగి ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు

హైదరాబాద్‌లోని హైదర్షా కోట్‌లో వినాయక నిమజ్జనంలో కాల్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే. నాగ మల్లేష్ అనే ఓ మాజీ ఆర్మీ అధికారి గన్‌తో కాల్పులు జరిపారు

అందుకే కాల్పులు జరిగాయి.. నార్సింగి ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2020 | 12:25 PM

Hyderabad Gun Firing:హైదరాబాద్‌లోని హైదర్షా కోట్‌లో వినాయక నిమజ్జనంలో కాల్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే. నాగ మల్లేష్ అనే ఓ మాజీ ఆర్మీ అధికారి గన్‌తో కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ విషయం తెలిసి వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నాగ మల్లేష్‌ని అదుపులోకి తీసుకోవడంతో పాటు గన్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నాగ మల్లేష్ నివసిస్తోన్న అపార్ట్‌మెంట్‌లో హై రీచ్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ సిబ్బంది నివసిస్తుండగా.. వారు అపార్ట్‌మెంట్ నిబంధనలకు విరుద్ధంగా పార్టీలు చేసుకునేవారని తెలుస్తోంది. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులు అసహనానికి గురయ్యారు. ఈక్రమంలో హై రీచ్ సిబ్బందితో తరచూ తగదాలు, ఘర్షణలు జరిగేవని సమాచారం. తాజాగా వినాయక నిమజ్జనం కోసం 40 మందిని పిలిపించిన హై రీచ్ నిర్వాహకులు.. మద్యం తాగుతూ, డాన్సులు చేస్తూ అర్ధరాత్రి వరకు అపార్ట్‌మెంట్ వాసులకు ఇబ్బంది కలిగించారు. ఇక అదే మత్తులో హై రీచ్ బ్రాండ్ బ్యాండ్ సిబ్బంది నాగ మల్లేష్‌తో వాగ్వాదానికి దిగడంతో.. సహనం కోల్పోయిన ఆ ఆర్మీ మాజీ అధికారి గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక ఈ ఘటనపై మాట్లాడిన అపార్ట్‌మెంట్ వాసులు హైరీచ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read More:

కాలేజీ మెరిట్‌ జాబితాలో సన్నీ లియోన్‌ టాప్‌

అవును మా తమ్ముడిపై మాకు ప్రేమ లేదు: సుశాంత్ సోదరి కీలక పోస్ట్‌