అట్టుడుకుతున్న కాశ్మీర్.. అసలేం జరుగుతోంది ? మోదీ ఆ రోజున జెండా ఎగరేస్తారా ?

జమ్మూ కాశ్మీర్ లో ఒకదానివెనుక ఒకటి పరిణామాలు జోరుగా సాగిపోతున్నాయి. అమర్ నాథ్ యాత్రికులకు, టూరిస్టులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, అందువల్ల వారు వెంటనే ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్ఛరించడం, మరో వైపు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గవర్నర్ సత్యపాల్ మాలిక్ ని కలిసి.. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి గురించి ప్రశ్నించడం, ఇంకొక వైపు భారీ ఎత్తున భద్రతాదళాలు ఇక్కడికి చేరుకోవడంవంటి పరిణామాలు ఇక్కడ […]

అట్టుడుకుతున్న కాశ్మీర్.. అసలేం జరుగుతోంది ? మోదీ ఆ రోజున జెండా ఎగరేస్తారా ?
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 4:40 PM

జమ్మూ కాశ్మీర్ లో ఒకదానివెనుక ఒకటి పరిణామాలు జోరుగా సాగిపోతున్నాయి. అమర్ నాథ్ యాత్రికులకు, టూరిస్టులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, అందువల్ల వారు వెంటనే ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్ఛరించడం, మరో వైపు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గవర్నర్ సత్యపాల్ మాలిక్ ని కలిసి.. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి గురించి ప్రశ్నించడం, ఇంకొక వైపు భారీ ఎత్తున భద్రతాదళాలు ఇక్కడికి చేరుకోవడంవంటి పరిణామాలు ఇక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న సస్పెన్స్ కి దారి తీస్తున్నాయి.రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ పై కేంద్రం పార్లమెంటులో ఓ ప్రకటన చేయాలని ఒమర్ అబ్దుల్లా.కోరుతున్నారు. . గవర్నర్ తో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసే ప్రసక్తి లేదని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆర్టికల్ 35 ఏ పై ప్రభుత్వమే క్లారిఫై చేయాల్సి ఉందని చెప్పారని అబ్దుల్లా వెల్లడించారు. 370 అధికరణం రద్దు గానీ, అలాగే ఈ ఆర్టికల్ 35 ఏ రద్దు గానీ జరగదని హామీ ఇచ్చారు. కానీ జమ్మూ కాశ్మీర్ పై ఆయనది తుది మాట కాదు.. కేంద్రమే దీన్ని స్పష్టం చేయాలి.. పార్లమెంటులో ఓ ప్రకటన చేయాలి.. అని అబ్దుల్లా అన్నారు. కాగా-రాష్ట్రంలో శాశ్వత నివాసానికి ఎవరు అర్హులు, ఎవరు కారు అన్నదాన్ని ఈ అధికరణం క్లారిఫై చేస్తోంది. రాష్ట్రంలో ఆస్తులను సంపాదించుకునే హక్కుతో సహా ఇతర హక్కులు, ప్రివిలేజ్ లకు ఇది వీలు కల్పిస్తోంది. కాశ్మీర్ లోయలో పెద్దఎత్తున భద్రతా బలగాల మోహరింపుపై అబ్దుల్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం 10 వేలమంది జవాన్లను తరలిస్తే.. తాజాగా గురువారం నాడు 25 వేల బలగాలను కేంద్రం తరలించడమేమిటని ఆయన ప్రశ్నించారు. అమర్ నాథ్ యాత్రికులకు, టూరిస్టులకు టెర్రరిస్టుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, అందుకే కేంద్రం ఈ చర్య తీసుకుందని గవర్నర్ తనకు చెప్పారని అబ్దుల్లా పేర్కొన్నారు. జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద శక్తులు ఏ క్షణంలోనైనా ఈ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆయన చెప్పినట్టు అబ్దుల్లా తెలిపారు. అయితే ఆరు నెలలుగా సైనిక బలగాలు ఇక్కడే ఉన్నాయని, ఇంత అత్యవసరంగా అదనంగా బలగాలను పంపాల్సిన అవసరం ఏమిటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. శాంతి యుతమైన రాష్ట్రాన్ని తాము కోరుతున్నామని తెలిపారు. ఒమర్ అబ్దుల్లా నేతృత్వాన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధి బృందమొకటి ప్రధాని మోడీని కలిసి కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితిని నివారించాలని కోరింది. సాద్యమైనంత త్వరగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు. ఇదిలాఉండగా… ఈనెల 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు జమ్మూ కాశ్మీర్లో బీజేపీ పంచాయతీ అధ్యక్షులు తమ ఇళ్లపై జాతీయ పతాకాలు ఎగురవేయనున్నారు. వేర్పాటువాదుల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వారికి ప్రత్యేక భద్రతను కల్పించనున్నారు. ఈ కారణంగానే గతవారం అదనంగా పారా మిలిటరీ బలగాలను తరలించారని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. గత ఏడాది నవంబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఆ ఎన్నికలను బాయ్ కాట్ చేశాయి. మరోవైపు-ఈ సారి సంప్రదాయాన్ని కాదని, ఢిల్లీలోని ఎర్రకోటలో కాకుండా ప్రధాని మోదీ.. జమ్మూకాశ్మీర్లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అప్పుడే ఆ రాష్ట్రంలో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా విభజించవచ్ఛుననే ప్రచారం కూడా సాగుతోంది. జమ్మును ప్రత్యేక రాష్ట్రంగా, కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయవచ్చునని అంటున్నారు. ఇదే సమయంలో ఎన్నికల సందర్భంలో.. పాకిస్థానీ శరణార్ధుల ఓటింగ్ హక్కుల విషయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. వారికి ఈ హక్కులు కల్పించాలని కాశ్మీర్లో చాలామంది కోరుతున్నారు. ఈ వర్గం పరోక్షంగా పాక్ ను సమర్థిస్తున్నట్టు భావిస్తున్నారు. వేర్పాటువాదుల డిమాండ్ కూడా ఇదే ! మరోవైపు-కాశ్మీరీ పండిట్లు స్వదేశానికి తరలి వచ్ఛే ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ ఈ సారి ఈ రాష్ట్రంలో ఈ నెల 15 న జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తే మాత్రం.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అత్యంత ప్రధాన ఘటనే అవుతుంది. పాక్ ఉగ్రవాద శక్తులు మునుపెన్నడూ లేనంతగా పేట్రేగడానికి రెడీగా ఉన్నారని వార్తలు వస్తున్న వేళ.. ప్రధాని ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారా అన్నది కూడా అనుమానమే అంటున్నవారూ లేకపోలేదు.