బ్రేకింగ్: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. పదో తరగతి విద్యార్థుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లలో ఉండి చదువుకున్న ఇతర విద్యార్థులను..

బ్రేకింగ్: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..
Follow us

|

Updated on: Jun 05, 2020 | 6:36 PM

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. పదో తరగతి విద్యార్థుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లలో ఉండి చదువుకున్న ఇతర విద్యార్థులను..ఎక్కడి వారిని అక్కడే తమ సొంత ప్రాంతాల్లో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది. విద్యార్థుల వివరాలను తమ జిల్లా డీఈవోలకు పంపించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఉదాహరణకు హైదరాబాద్‌లో ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో ఉండి చదువుకున్న విద్యార్థి వరంగల్ జిల్లాకు చెందిన వారైతే..వరంగల్ జిల్లాలో తన ఊరికి దగ్గర ఉన్న పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఉంది. మరోపక్క పది పరీక్షలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు.. శనివారం రోజుకు వాయిదా వేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గురించి హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వాన్ని సంప్రదించి ..రేపు నిర్ణయం తెలుపుతామని సమాధానమిచ్చారు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.