Shocking news: గ్రామంలోకి పోటెత్తిన గోదారమ్మ

తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలోకి ఉన్నట్లుండి గోదావరి నది పోటెత్తింది. దాంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గోదావరి వరద నీటిలో బతుకుతున్నారు.

Shocking news: గ్రామంలోకి పోటెత్తిన గోదారమ్మ
Follow us

|

Updated on: May 24, 2020 | 12:46 PM

Godavari river water entered into a village and spread across village: తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలోకి ఉన్నట్లుండి గోదావరి నది పోటెత్తింది. దాంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గోదావరి వరద నీటిలో బతుకుతున్నారు. సముద్రపు పోటు పెరగడంతో గోదావరి నీరు తమ గ్రామంలోకి మళ్ళిందని గ్రామస్తులు భావిస్తున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలోకి గోదావరి వరద నీరు పోటెత్తింది. ఉన్నట్లుండి రాత్రి పూట గ్రామంలోకి గోదావరి నీరు పెద్ద ఎత్తున చొచ్చుకురావడంతో జనం ఉక్కిరిబిక్కిరియ్యారు. ఎటూ తోచక వరద నీటిలోనే మగ్గుతున్నారు. అమావాస్య కారణంగా సముద్రం రివర్స్ పోటు పెరగడంతో గోదావరి నీరు దారి మళ్ళిందని గ్రామస్తులు చెబుతున్నారు.

సముద్రము, గోదావరి పోటు పెరగడంతో వరద పోటు నీరు గ్రామంలోకి.. నేరుగా తమ ఇళ్లలోకి చేరడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు పల్లెకారులు. సరైన రక్షణ గోడ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని పల్లె కారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.