GHMC Elections Results 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూసుకెళుతున్న కారు.. ఖైరతాబాద్, సనత్నగర్ డివిజన్లో గులాబీ జెండా రెపరెపలు..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దూసుకెళుతుంది.జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సనత్నగర్ కౌంటింగ్ సెంటర్లో
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దూసుకెళుతుంది.జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సనత్నగర్ కౌంటింగ్ సెంటర్లో అమీర్పేట్, సోమాజిగూడ, ఖైరతాబాద్, సనత్నగర్లకు సంబంధించి ఓట్లను లెక్కించారు. మూడు డివిజన్ల ఫలితాలు రాగా ఇంకా సోమాజి గూడ ఫలితం రాలేదు. రెండో రౌండ్ లెక్కింపు కొనసాగుతుంది. ఖైరతాబాద్ డివిజన్లో బీజేపీ ప్రత్యర్థిపై 2543 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయ రెడ్డి గెలుపు సాధించారు. సనత్నగర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి పై టీఆర్ఎస్ అభ్యర్థి కొలను లక్ష్మి రెడ్డి విజయం సాధించారు. అమీర్పేట డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్తి సరళ 1301 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. దీంతో ఆయా డివిజన్లో కార్యకర్తలు గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ 54 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 42, ఎంఐఎం 42, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించింది. GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..