గ్రేటర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ.. పార్టీని వీడిన మరో ఇద్దరు నేతలు.!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్…

  • Ravi Kiran
  • Publish Date - 7:42 am, Wed, 18 November 20
GHMC Elections

GHMC Elections: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్, భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ పార్టీకి, వారి పదవులకు రాజీనామా చేశారు. వీరిరువురూ బీజేపీలోకి చేరనున్నారు. దీనితో కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.

కాగా, బీజేపీ ఆకర్ష్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతోంది. ఇప్పటికే కొప్పుల నరసింహ్మరెడ్డి బీజేపీలోకి చేరగా.. నేడు ఫతేనగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ ముద్దాపురం కృష్ణగౌడ్, మాజీ మేయర్ బాండ కార్తీక రెడ్డి బీజేపీలోకి చేరనున్న సంగతి తెలిసిందే. వీరి బాటలోనే మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది.

Also Read:

‘వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం’.. వారికి మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!

ఐపీఎల్ 2021: మారనున్న టీమ్స్ రూపురేఖలు.. మెగా ఆక్షన్‌లోకి ధోని, స్మిత్, విలియమ్సన్‌లు వచ్చే అవకాశం..

Flash News: ఫిబ్రవరిలో ఏపీ పంచాయితీ ఎన్నికలు.. ఎస్‌ఈసీ కీలక ప్రకటన..?