ప్రాణాలు తీసిన గంజాయి.. హైదరాబాద్‌లో దారుణం

క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునేవారు కొందరైతే.. చిన్నపాటి గొడవలకే ప్రాణాలు తీసేవారు మరికొందరు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. స్ధానికంగా నివాసముండే ప్రేమ్ అనే యువకుణ్ని అతని స్నేహితుడే అత్యంత దారుణంగా కొట్టి చంపేశాడు. స్ధానిక పోలీసుల కథనం ప్రకారం మృతుడు ప్రేమ్‌కు, సతీశ్ అనే వ్యక్తికి మధ్య గత కొంతకాలంగా గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో గంజాయి అలవాటున్న ప్రేమ్‌కు దాన్ని ఎరగా వేశాడు సతీశ్. దీంతో అక్కడ […]

ప్రాణాలు తీసిన గంజాయి.. హైదరాబాద్‌లో దారుణం
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2019 | 5:06 PM

క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునేవారు కొందరైతే.. చిన్నపాటి గొడవలకే ప్రాణాలు తీసేవారు మరికొందరు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. స్ధానికంగా నివాసముండే ప్రేమ్ అనే యువకుణ్ని అతని స్నేహితుడే అత్యంత దారుణంగా కొట్టి చంపేశాడు. స్ధానిక పోలీసుల కథనం ప్రకారం మృతుడు ప్రేమ్‌కు, సతీశ్ అనే వ్యక్తికి మధ్య గత కొంతకాలంగా గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో గంజాయి అలవాటున్న ప్రేమ్‌కు దాన్ని ఎరగా వేశాడు సతీశ్. దీంతో అక్కడ వాగ్వాదం జరగడంతో ప్రేమ్‌పై దాడిచేసి తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్ అక్కడికక్కడే మ‌ృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన జరిగిన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.