ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. జాతీయ జల జంతువును కొట్టి చంపిన యువకులు.. పోలీసుల అదుపులో ముగ్గురు వ్యక్తులు

ప్రతాప్‌గఢ్ జిల్లాలో డాల్ఫిన్‌ను కర్రలు, గొడ్డలి, రాడ్లతో కొట్టి దారుణంగా హింసించి చంపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం..  జాతీయ జల జంతువును కొట్టి చంపిన యువకులు.. పోలీసుల అదుపులో ముగ్గురు వ్యక్తులు
Follow us

|

Updated on: Jan 08, 2021 | 9:42 PM

Dolphin beaten to death:ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం వెలుగుచూసింది. మానవత్వం మరిచిన కొందరు యువకులు మూగ జీవాన్ని చావబాదారు. జాతీయ జల జంతువు అయిన డాల్ఫిన్‌ను అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. డిసెంబరు 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలో డాల్ఫిన్‌ను కర్రలు, గొడ్డలి, రాడ్లతో కొట్టి దారుణంగా హింసించి చంపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న యూపీ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని కొఠారియా గ్రామ సమీపంలోని శారద కెనాల్‌లో చేపల వేటకు వెళ్లారు. కాగా, యువకుల వలకు 5 అడుగుల పొడవున్న డాల్ఫిన్ చిక్కింది. అయితే, దానిని పెద్ద చేపగా భావించిన యువకులు బయటకు వచ్చి చూసి నిరుత్సాహానికి గురయ్యారు. అది డాల్ఫిన్ అని తెలిసి.. అతి దారుణంగా గొడ్డలి, కర్రలతో దాడి చేశారు. వారి పైశాచికత్వంతో కత్తులతో దాని శరీరాన్ని రెండుగా చీల్చారు. అనంతరం దానిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసిన ఓ యువకుడు దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియో కాస్త పోలీసులకు చేరడంతో సీరియస్‌గా తీసుకున్నారు. ఈఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సమీప గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. డాల్ఫిన్ చంపడం వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 9/51 ప్రకారం శిక్షార్హమైన నేరం కింద కేసు పెట్టి నిందితలును జైలు పంపించారు పోలీసులు. డాల్ఫిన్‌ను అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు…

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు